మరుపురాని అద్భుతం

  • 1186 Views
  • 0Likes

    శ్రీదేవి సురేష్‌ కుసుమంచి

  • విజయనగరం
  • 7032760484

ఆ మస్తిష్క పొరలు ఎంత
ఆపేక్షతో ఆలింగనం
చేసుకున్నాయో గాని!
కండరాలు శుష్కించిపోతున్నా...
వయసు కాలమనే జల్లెడలో 
జారిపోతున్నా!
ఎన్నో బంధాలు ఒకటై
వేరుపడి ఒంటరులుగా
మిగిల్చి వెళ్లిపోతున్నా!
తగిలిన ఆటుపోటులు కూడా
కుచించుకుపోయిన
ఆ వృద్ధ ఆచ్ఛాదనంలో
మరుగునపడిపోతున్నా!

ఆ మధుర క్షణాలు మాత్రం
వణుకుతున్న 
హృదయ సవ్వడులను
తాకగానే....
ముడుచుకుపోయిన
ఆ మస్తిష్క పొరలుకూడా
ఒక్కసారిగా
నింగిన పరచుకునే
ఇంద్రధనస్సులా విప్పారి
మదిని ఆహ్లాదపరుస్తాయి....
బహుశా అవి అమ్మతో
గడిపిన మరుపురాని అద్భుత
బాల్యపు రోజులనుకుంటాను...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


మురళీగానం

మురళీగానం

సుధీంద్ర‌భార్గ‌వ‌