ఆటలాడు భాష మాటలాడు

  • 665 Views
  • 3Likes

    జాగాన సింహాచలం

  • పార్వతీపురం

ఆటపాటలకును ఆంగ్లమ్ము సరిగాదు
చిన్నపాపలెల్ల చిన్నబోవు
తల్లిభాష లేక తల్లడిల్లుదురయ్య
పెదవి విప్పరండి పెద్దలార!

చదువు చెప్పు గురువు చదివించు వారలు
సహజగుణము మరచి చదువు చెప్ప
తల్లి విడచి ఉండు పిల్లవాని పగిది
పిల్లవార లెల్ల గొల్లు మనరె!

తల్లితరము నుంచి తనదైన భాషలో
తలపులోన మలుపు తెలుప సులువు
తగిన వయసులోన తర్ఫీదు నిచ్చిన
భాషలెన్నియైన బాలనేర్చు 

మాతృభాష నొదలు మానవత్వంబేమి
గొప్పభాష నేర్వ తప్పుగాదు
రాకపోక లేని రక్తసంబంధమౌ
భాషణంబు లేని భాషయైన

ఆంగ్లభాషలోన అందించలేడేమి
తెలుగులోన నేర్పు తెలిసినట్లు
నిజము చెప్పరయ్య నియమానురక్తులు
బాలబాలురకును భవిత చెడును

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


జ‌ల క‌ల‌

జ‌ల క‌ల‌

సాక హరీష్‌


తేట తెలుగు

తేట తెలుగు

విద్వాన్ గొల్లాపిన్ని నాగ‌రాజ‌శాస్త్రి


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


వసంతశోభ

వసంతశోభ

స్వర్ణలతానాయుడు


నీ నీడలో....

నీ నీడలో....

డా॥ దిలావర్‌,