స్నేహవారధి

  • 980 Views
  • 0Likes

    గొడవర్తి శ్రీనివాస్‌

  • పెదపళ్ళ , తూర్పుగోదావరి
  • 9963556696

సంద్రానికెంత ఆశో...
దూరాన ఉన్న శిఖరాన్నందుకోవాలని...
ఆ శిలతో స్నేహించాలని....
అందుకే సంద్రం ఆశతో ఎగుస్తుంది...,
అలై పైకెగురుతుంది....,
ఉప్పెనై ఉరకలేస్తుంది...,
అయినా శిఖరం అందుతుందా?
అందదు...
తొణకదు...బెణకదు...
కాస్తయినా చలించదు,
దాని నిశ్చలత్వం దానిదే..దాని స్థిరత్వం దానిదే..
సంద్రం సైతం తన ఆశను విడనాడదు....,
అంతులేని తపనతో తానే
ఆవిరి అవుతుంది...
కానీ....తన
ఆకాంక్షను మాత్రం ఆవిరిచేసుకోదు...కొంతైనా!
ఆవిరైన సంద్రం
ఆకాశానికెగసి మేఘమై గర్జిస్తుంది...
మెరుపై గాండ్రిస్తుంది...
దాని ప్రయాణం సరాసరి శిఖరం మీదికే...
క్షారజలం కాస్తా జీవజలంగా మారి,
ప్రేమగా శిఖరం శిరస్సును ముద్దాడుతుంది...
తాను తునాతునకలై దాని శరీరాన్నంతా
తన అనురాగపుజల్లులతో నిలువునా తడిపేస్తుంది.
సంద్రం చాచిన స్నేహహస్తానికి
ఆ కఠినశిల సైతం కరిగిపోతుంది...
సంద్రం కురిపించిన స్నేహపుజల్లుల్లో
తడిసిముద్దయినా శిఖరం కాస్తా
ఆ స్నేహ ప్రవాహాన్ని దోసిలిపట్టి
తనకు ఆధారభూతమైన
నేలతల్లికందించి నమస్కరిస్తుంది.
ఆ ప్రవాహ పయనం సరాసరి సంద్రంలోకే...
శిఖరానికి, సంద్రానికి నడుమ స్నేహానికి
చిహ్నంగా వాటి మధ్య
నది ఒకటి నిలుస్తుంది...
నిరంతరాయంగా...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరచేయి

అరచేయి

తగుళ్ల గోపాల్


క్రీస్తు జననం

క్రీస్తు జననం

పచ్చా పెంచలయ్య


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


వాన

వాన

తానా మూర్తి


మామిండ్ల కాలం

మామిండ్ల కాలం

దాసరాజు రామారావు


కృష్ణం వందే!!

కృష్ణం వందే!!

పేరిశెట్ల శివకుమార్