కచేరీ

  • 478 Views
  • 1Likes

    కోడూరి రవి,

  • కరీంనగర్
  • 9491470260

చతుర్వేద సారమెరిగి
అష్టాదశ పురాణాలనందించిన
వ్యాసుడెందుకు
వారణాసిని శపించాడో
   నాకిప్పుడు తెలుస్తోంది.....
ఒక్క కుక్క కూడా
నాదేశాన పస్తుండరాదని
నరేంద్రుడెందుకు పరితపించాడో
ఒక్క రొట్టెకోసం
విప్లవాలెందుకు పుట్టాయో
   నాకిప్పుడు అవగతమవుతోంది
కాయం నిండా నెత్తుటి గాయం
కొరడా దెబ్బలు
ఒక్క ముద్దకోసం
ఒడలెల్లా రుధిరపు కాలువలైన
పెద్దమ్మలవారి యాతన
   నాకిప్పుడు కనిపిస్తోంది 
పండువెన్నెలైనా మండుటెండైనట్టు
నిప్పుల కొలిమి రాజేసినట్టు
కడుపు అల్లకల్లోలమై
కలవరపెడుతోంటే
ఏ తాన్‌సేన్‌
ఆలపించాల్సిన పనిలేదు--
కన్నీటి వర్షం కురిపించడానికి
ఒక్క ఆకలిరాగం చాలు.... 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఆటలాడు భాష మాటలాడు

ఆటలాడు భాష మాటలాడు

జాగాన సింహాచలం


తెలుగుభాష సోయగం

తెలుగుభాష సోయగం

గుండంపాటి విజయసారధి


సెల్ఫీ

సెల్ఫీ

నారాయణమూర్తి తాతా