క్రీస్తు జననం

  • 874 Views
  • 0Likes

    పచ్చా పెంచలయ్య

  • మహమ్మదాపురం, నెల్లూరు
  • 9912822341

దేవ దేవుడు ఒకసారి దేహయుతుడై
జననమందను తలచెను జగతిలోన
పాప కూపాన దేలెడు పతితులకును
మోక్ష మార్గంబు జూపను మోదమలర

అందుకు సరియగు గర్భము
ఎందున కలదంచు వెతుక ఇద్ధరలోనన్‌
పొందుగ కన్నియ మరియమ
అందుకు తగురీతిదొరకె ఆతని మదికిన్‌

నిశ్చితార్థ మయ్యి నిజలెక్క కోసమై
పొరుగు దేశమునకు పోయి యున్న
కన్నె మరియ యొక్క కమనీయ గర్భాన
జేరె దైవసుతుడు చింత దీర్ప

తానే తనయుని మాదిరి
మానవ రూపంబుదాల్చి మరియకు
                   బుట్టన్‌
దానవ పోకడలడరెను
దీనులు సంతోషమందె దిగులది 
                 వీడన్‌

పశులపాకలో పుట్టిన పరమ
          గురుని
ఇహము పరములు గాచెడి 
             ఈశుడనుచు
పొగడి సాంబ్రాణి, బోళముల్‌ 
            పొలుపుమీర
ఇచ్చి దర్శించె జ్ఞానులు ఈప్సితాన

నేనే సత్యము జీవము
నేనే నిజమార్గమనుచు, నిజమును దెలుపన్‌
పూనిక ఆతని బాటను
మానవులందరును సాగ మంచదితనరెన్‌

మానవులందరొక్కటనె, మానుషహత్యలు తప్పుతప్పనెన్‌
మానుడు ద్వేషభావననె, మానుడు హింసను, 
మంచితోననెన్‌
మానుడు నిందలేయుటనె, మానుడ బద్ధపు సాక్ష్యమిచ్చుటన్‌
మానుడు జారపోకడను మాన్యత నందగ తండ్రికాడనెన్‌

అవనిని సత్యమార్గమును ఆదరమొందగ నిల్పబూని, ఆ 
భువనములేలు దేవుడిటు పుణ్య వశంబున జన్మనంది, ఓ
నవయుగ స్థాపనంబిడెను, నమ్మిన వారికి నాకమిచ్చియున్‌
అవసరముండి వేడుకొన, ఆప్తుడు, క్రీస్తుడు అండనుండడే

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌