నవ్వేటి ఆడపడుచు

  • 104 Views
  • 0Likes

    ఆరుట్ల శ్రీదేవి

  • నిజామాబాదు
  • 9550554866

సింగారి భామలకు
సిరిగల్ల సీరెలు
సీరెల్ల పోగులు
బంగారు తీగెలు
పోగు బంగారమ్మీద
సిరిమల్లె పువ్వులు
పువ్వులన్నింటీ మీద
రతనాల రంగులు
మెరిసేటి రైకకు
అద్దాల హంగులు
అద్దంల మురిసేటి
ఈ ముద్దుగుమ్మలు
గుమ్మలకు ముద్దొచ్చె
కమ్మలూ గున్నాలు
కొశ్శేటి ముక్కుకు
తళుకు బుల్లాకీ
సన్నాటి నడుముకు
పగడపొడ్డాణం
కదలాడు పాదాలు
పసుపు వన్నెల్లు
వన్నెలకు వెన్నెల్ల
వెండిపట్టాలు
పట్టుకుచ్చుల్లా కురులు
తుమ్మెదా రెక్కలు
పట్టుకుంటే జారు 
పడుచు కోరికలు
పెట్టుకున్నా పువ్వు
ముద్ద మందారం
పొద్దుపొడుపూ రంగు
నుదుటి సిందూరం
నవ్వితే చాలు
చుక్కల్లు రాలె
సాగేటి మెడకు 
హారమై నిలిచె
నవ్వుతూ ఉండమ్మ
నవ్వుతూ ఉండు
చల్లంగ నువ్వెపుడు
నవ్వుతూ ఉండు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఒక ఎండు చేప మరొక పాత టైరు

ఒక ఎండు చేప మరొక పాత టైరు

ఇంద్రపాల శ్రీనివాస్‌


నవవర్షం నవరాగం

నవవర్షం నవరాగం

జి.పాండురంగారావు


పరిణయం

పరిణయం

ప్రియాంక వజ్రాల


తొలకరి

తొలకరి

నారాయణమూర్తి తాతా