తెలుగు పాట

  • 492 Views
  • 2Likes


ప: తెలుగుభాష తీయదనం 
తెలుగుజాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్లకి 
తెలుగే ఒక మూలధనం
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువ్వు మరచినట్టురా 
ఇది మరువబోకురా             ।।తెలుగుభాష।।
చ-1 అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది
మమ్మీ, డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది...
మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అత్తా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ, అంకుల్‌లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది?
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు     ।। 2 ।।
కాని నీ భాషలోనె నువ్వు సంభాషించు
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా 
కొంత రుణం తీర్చరా
మా తెలుగు తల్లికి మల్లెపూదండ... మా కన్న తల్లికి మంగళారతులు
చ-2 కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు ।।2।।
అది భాషా ఆచారాలను మింగేయొద్దు...
తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గు పడకురా వెనక్కి తగ్గమాకురా...
తెలుగుభాష తీయదనం తెలుగుభాష గొప్పదనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం
మమ్మీ, డాడీ అన్న మాట మరుద్దామురా...
అమ్మా, నాన్నా అంటూ నేటి నుంచి పిలుద్దామురా. 
ప్రతిజ్ఞ పూనుదామురా
చిత్రం: నీకు నేను నాకు నువ్వు; 
రచన: చంద్రబోసు;
సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌; 
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చరణ్‌

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


దీపావళి

దీపావళి

నారాయణమూర్తి తాతా


సరిహద్దు

సరిహద్దు

డా.వై.రామకృష్ణారావు


ప్రశ్నార్థకం

ప్రశ్నార్థకం

గిరిప్రసాద్‌ చెలమల్లు


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


సంక్రాంతి సందడి

సంక్రాంతి సందడి

పచ్చా పెంచలయ్య


వెన్నెలమ్మ మాట

వెన్నెలమ్మ మాట

వెన్నెల సత్యం