పల్లె పాట

  • 263 Views
  • 4Likes

    వై.వసంత

  • దౌల్తాబాద్, మెదక్‌.
  • 9963460939

పొద్దుగాల్ల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల  ।।2।।
సూరీడొచ్చి తొంగిజూసెరో మా పల్లెలోన
చెర్లనీరు మెరవవట్టెరో మా పల్లెలోన
బర్లమంద సాగవట్టెరో మా పల్లెలోన
సద్దిమూట నెత్తికెక్కెరో మా పల్లెలోన
పొద్దుగాల్ల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల ।।2।।
రైతునాగలెత్తవట్టెరో మా పల్లెలోన
కమ్మరి కొలిమి ఎలగవట్టెరో మాపల్లెలోన 
కుమ్మరి చక్రం తిరగవట్టెరో మాపల్లెలోన
సాకలి మూటలెత్తవట్టెరో మా పల్లెలోన
పొద్దుగాల్ల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల ।।2।।
వానచినుకు రాలవట్టెరో మా పల్లెలోన
పంటచేను లూగవట్టెరో మా పల్లెలోన
పంటచేతికందినాదిరో మా పల్లెలోన
గా దినమే పండుగంటరో మా పల్లెలోన
పొద్దుగాల్ల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల ।।2।।
పడుచులంత పాడవట్టెరో మా పల్లెలోన
పాటలోన కథలు సూడరో మా పల్లెలోన
గా కథలె మా బతుకులురో మా పల్లెలోన
మారని తలరాతసూడరో మా పల్లెలోన
పొద్దుగాల పొద్దుగాల్ల కోడీగూసె పొద్దుగాల్ల ।।2।।

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


భావకేదారం

భావకేదారం

సూరారం శంకర్‌


అస్తిత్వ పోరు

అస్తిత్వ పోరు

డి.నాగజ్యోతి శేఖర్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


సోపతి

సోపతి

పొన్నాల బాలయ్య