శృంగార వాసంతం

  • 216 Views
  • 0Likes

    బందరు దుర్గాప్రసాద్

  • కవిటి శ్రీకాకుళం
  • 8978155781

కలరవామృత గానముల కోకిలమ్ములు
     సృష్టిని పులకింపఁ జేయు వేళ
చిగురు జొంపములు మేల్‌ చిత్రలేఖనములు
     కనుల పండువు సేయఁ గడఁగు వేళ
హృదయ మాధుర్యమ్ము ప్రియమార చిలికించి
     విరి కన్నియలు సమర్పించువేళ
శుకశారికా తతుల్‌ సుమధుర స్వరములో
     స్వాగత వచనముల్‌ పలుకు వేళ
అవ్యయానంద భావ విన్యాస గతుల
అఖిల లోకమ్ము పరవశమందు వేళ
తన్మధుర భావనలకు నిత్యత్వమొసగ
అవతరించెను మధుమాస మవనియందు

ఎలకోయిలమ్మ తేనెల చిల్కు గొంతులో
     రాగాల చక్కెర రంగరించి
నవ వధూ హృదయ నందన వనసీమలో
    శృంగార మధువులు చిలుకరించి
పరవశత్వముఁజెందు ప్రకృతి కాంతనుఁజేరి
    ప్రణయ రాగము తోడఁ పలుకరించి
మ్రోడు వారిన వృక్షముల జీవితములందు
    చిగురుటాశల మేలి సొగసులుంచి
కష్టసుఖములు - కాల చక్రమ్మునందు
శాశ్వతములు కావనెడి వాస్తవముఁదెలిపి
యెల్లరకు సేమమునుఁగూర్ప నిచ్చగించి
లలిత శృంగార మధుమాస లక్ష్మి వచ్చె

మరబొమ్మల వలె నరులె
ల్లరు - మమతలు మఱచి - బ్రతుకులను 
మిక్కిలి దుర్భర రీతి గడుపగా - ‘‘శార్వరి’’ 
సుఖ శాంతుల నొసంగ వచ్చెను ప్రీతిన్‌

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


భావకేదారం

భావకేదారం

సూరారం శంకర్‌


అస్తిత్వ పోరు

అస్తిత్వ పోరు

డి.నాగజ్యోతి శేఖర్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


సోపతి

సోపతి

పొన్నాల బాలయ్య