ఉగాది

  • 719 Views
  • 6Likes

    బి. రఘురామరాజు

  • హైదరాబాదు
  • 7893788326

పాతాళగంగను పైకి రప్పించే
అర్జునుడు కనబడక,
బోరునీళ్లు పాతాళంలోనే ఉండిపోయాయి!
కరవుతో పోరాడలేని అన్నదాతలు,
కరెంటుతీగలకు వేలాడుతున్నారు శవాలుగా!
మామిడి చెట్ల మీద పూత కనిపించక
తుమ్మ కొమ్మల మీదే కూర్చుని
కునుకు తీస్తున్నాయి కోకిలమ్మలు!
వానలు, పంటలకు లంకె ఏమిటో కూడా 
తెలియని కాలేజీ కుర్రకారు 
క్రికెట్‌ మైదానంలో దౌడు తీస్తున్నారు అటు, యిటూ!
గుళ్ల ముందు నుంచోవాల్సిన కొత్తజంటలు
కోర్టుల ముందు నుంచుంటున్నాయి
తెగదెంపులు చేసుకోడానికి!
ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికి
నల్ల కుబేరుల జాబితా
వల్లె వేస్తున్నారు జాతీయ నాయకులు!
ఇన్ని దుర్భర, దుస్సహ దృశ్యాల మధ్య
ఇవేమీ పట్టనట్లు
తెల్ల లాల్చి, పైజామా తొడుక్కుని
గండు కోయిలల గురించీ
పండు వెన్నెలల గురించీ
కవిత్వం రాయడానికి 
నా మనస్సెందుకో ఒప్పుకోడం లేదు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరచేయి

అరచేయి

తగుళ్ల గోపాల్


క్రీస్తు జననం

క్రీస్తు జననం

పచ్చా పెంచలయ్య


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


వాన

వాన

తానా మూర్తి


తేనె చినుకులు

తేనె చినుకులు

పిళ్లా చింత‌ప్ప‌డు