నీ నీడలో....

  • 302 Views
  • 0Likes

    డా॥ దిలావర్‌,

  • పాల్వంచ భద్రాది జిల్లా.
  • 9866923294

నువ్వు వేగుచుక్కవై
తెల్లవారుఝామును మేల్కొల్పుతున్నప్పుడు
ఆ లేత వెలుగు రేకల్ని ఏరుకుంటూ
మా నిద్రమత్తు ఆవులించేది
కోటేరు వేసుకొని నువ్వు పొలం వెళ్తుంటే
యుద్ధానికి వెళ్తున్న సైనికుడిలా ఉండేది
నువ్వు నాగలై, కర్రై, ఎదగొర్రై
మట్టిలోకి చొచ్చుకుపోయినప్పుడల్లా
మట్టి; అణువణువూ తన్మయత్వంలో పులకించిపోయేది
నీ చెమటలో నానిన మట్టిలోంచి
కేర్‌మంటూ విత్తనం మొలకెత్తడం
ఎంత కళాత్మక సృజన!!
నీకోసం ఆకాశంలోంచి పొలంలోకి దిగి
నక్షత్రాలు నక్షత్రాలుగా అర్రొంచడం
ఎంత మనోహర దృశ్యం!!
సేదదీరు తున్నప్పుడల్లా
నువ్వొక హరిశ్చంద్ర పద్యానివై
చీకటి ముసిరిన పల్లెను
సంగీత విద్యుత్తరంగాలతో వెలిగించడం
మన ఊరింకా మరచిపోలేదు
లోకంలో అన్నిటికన్నా ఆకలే పెద్ద రోగమైనప్పుడు
నువ్వు అన్నపు ఔషధం గావడం....
ప్రపంచమెప్పుడూ నీకు రుణపడే ఉంటుంది
ఎవరన్నారు నువ్వు పోయావని?
నువ్వు చెట్టువై కొమ్మలు చాచి
మమ్మల్ని అక్కున చేర్చుకోవడం
ఇప్పుడ గతమే కావచ్చు
నువు ఇచ్చిన నీడ మాత్రం
మా బతుకులకు చల్లని అండగా మిగిలే ఉంది
పొలాల్ని చూసినప్పుడల్లా
నువ్వు పచ్చ పచ్చగా పలకరిస్తున్నట్టుగానే ఉంటుంది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


సరిహద్దు

సరిహద్దు

డా.వై.రామకృష్ణారావు


ప్రశ్నార్థకం

ప్రశ్నార్థకం

గిరిప్రసాద్‌ చెలమల్లు


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


సంక్రాంతి సందడి

సంక్రాంతి సందడి

పచ్చా పెంచలయ్య


వెన్నెలమ్మ మాట

వెన్నెలమ్మ మాట

వెన్నెల సత్యం


మరుపురాని అద్భుతం

మరుపురాని అద్భుతం

శ్రీదేవి సురేష్‌ కుసుమంచి