కరోనా విలయం

  • 1436 Views
  • 30Likes

    సాహితీసుధ


వీధుల్లో ఏ సడీ లేదు
తలుపుల అలికిడీ లేదు
సీసా తెరచి ఈ భూతాన్ని బంధించేదెవుర్రా!
అని, ఒక్కొక్కరూ పడకమీద మేను వాల్చి
వేడి నిట్టూర్పులు వదుల్తూ..
కాలంలో 
విరుచుకుపడ్డ మహమ్మారుల 
ఇనుప గజ్జెల నాట్యాన్ని
నేను చూశానంటే నేను చూశానని ఒకడూ 
మా అయ్య కాలంలో జరిగిందని మరొకడూ 
ఇంత విపరీతం ఏనాడూ చూడలేదని...
కాలజ్ఞానాలూ.. బైబిల్‌ ప్రవచనాలూ.. 
నెరవేరే కలికాల ఆగమ చిహ్నాలే 
ఈ విషగాలులనీ మరొకరూ
దిగులు చెందుతూ... దీనులౌతూ
దిగుల దుప్పటి కప్పుకుని
రేపటి వెలుతురు కోసం 
కిటికీలు తెరిచే ధైర్యం చాలక
ముసుగులూ..
మాస్కులపై అవగాహన చిక్కక
గుమ్మందాటి ఇవతలకి రావద్దనే
ఏలినవారి ఎచ్చరికను కాదంటే
ఏటౌదాదీ..! 
లచ్చుమన్నరేఖ దాటొచ్చిన సీతమ్మోరి కథ 
తెరిపిన కొచ్చి
ఆరగారగా గొంతు తడిపే 
ముంతకల్లు మాటే మరసి
వడగాలికి అల్లల్లాడే పిట్టగూడు మాదిరి
జారిపోతున్న పిడతంత గుండెను దిటవు చేసుకుని
ఒకే మాట పదే పదే అనుకున్నారు
ఖండాలిప్పుడు ఒక్కటయ్యాయి...
కారుణ్యంతో మానవులంతా ఒక గూటికిందకొచ్చారు
ఆయుధాలు వదలిన చేతులే 
శుభ్రత కోసం ముందుకు చొచ్చుకొస్తున్నాయి
ఇప్పుడు..
ఏ విషజ్వాలా .. ఏం చేయలేదు
ఈ విలయాలు ఎవ్వరినీ పడదోయలేవు
మనిషికాక ఈ మారణహోమాన్ని 
ఎవడు తప్పిస్తాడు!
మనిషి కోసం మనిషి కాక
ఈ మహా వ్యూహాన్ని ఎవడు ఛేదిస్తాడూ!!
మనిషే!
మనిషే!!
ఎప్పటికైనా మనిషే!!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌