ఆశాకిరణం

  • 950 Views
  • 2Likes

    ప‌ద్మావ‌తి రాంభ‌క్త‌

  • విశాఖ‌ప‌ట్నం
  • 9966307777

దిగులుమబ్బుల్లో తప్పిపోయిన ఆలోచన
శూన్యాకాశపు చూరుకు
గబ్బిలంలా వేలాడుతుంది
తొక్కిపెట్టిన ఆనకట్టను దాటుకుని
అక్షరాలు కన్నీటిబొట్లై రాలిపడుతుంటాయి
అడుగడుగునా లెక్కించలేనన్ని ముళ్లతో
పాదమంతా నెత్తుటివరద
ఎంత నచ్చజెప్పినా
మాట వినని చిన్నపిల్లలా
మెలితిరిగిన మనసు
చీకటి కలుగులో ముడుచుకుంది
రాత్రులను పగళ్లుగా
తర్జుమా చేయలేని అశక్తత
కనుపాపలపై సాలెగూడులా అల్లుకుంది
మసక వెలుగుతో
పడమటకు జారిపోతున్న సూర్యుణ్ని
వేలెత్తి చూపిస్తూ
అద్దంలోని ప్రతిబింబం వెక్కిరిస్తుంది
లోపల సముద్రాలు
కర్ణకఠోరంగా విరుచుకుపడుతున్న మోత
శ్వాసాడని ఉక్కిరిబిక్కిరితనం చుట్టుముడుతుంది
భరించలేనంత నిశ్శబ్దం
నల్లని నీడలా వద్దన్నా కౌగిలించుకుంటుంది
ఈదేకొద్దీ సుడిగుండం
మరింత లోపలికి లాగేస్తుంది
తెలియని బాధ చిక్కగా
నేలంతా ఒలికిపోతుంది
రెపరెపలాడుతూ
కొడిగడుతున్న దీపం
తనలోకి తనే
చమురును ఒంపుకుని
గుండెవత్తిని ఎగదోసుకుంటూ
హృదయం పగలకుండా
సరికొత్త వెలుతురు పాటేదో
శ్రుతి చేసుకోక తప్పదు
ఉన్నట్టుండి
తెల్లవారు ఛాయలలో
ఆశాకిరణం తళుక్కుమంటూ
కర్తవ్యాన్ని బోధిస్తుంది
తడితడిగా వాక్యం నడిచొస్తుంటే
బరువుగుండె చప్పున తేలికపడుతుంది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌