తపిస్తూ... రమిస్తూ... అక్షరంతో!

  • 1316 Views
  • 0Likes

    డా।। ఎ.రవీంద్రబాబు

  • హైదరాబాదు.
  • 8008636981

నాలుగు క్షణాల మధ్య దూరం తెగిపోతుంది
కాలం ఆది అంతం లేకుండా ఆగిపోతుంది
చర్య, ప్రతిచర్యల మధ్య వారధి కూలిపోతుంది
స్వయం సంచలిత చలనం పురుడు పోసుకుంటుంది

ఏ శిలాజమో.. ఒయాసిస్సై గుండెల్లో ఉబుకుతుంది
ఏకాంతాలన్నీ బహుముఖీనాలవుతాయి
ఎదంతా ఉప్పెనై చీకటిగా ద్రవిస్తుంది
నన్ను నేను తవ్వుకోవడానికి నీ జ్ఞాపకాల్ని విప్పుతాను

చంద్రుడు అస్తమిస్తాడు
వేళ్ల చివర విచ్చుకున్న నక్షత్రాలు నిద్రిస్తాయి
పొడిపొడిగా ఓ సవ్వడి రాలుతుంది
పొరలు పొరలుగా దేహం విడిపోతుంది
అరలు అరలుగా నాలోని నువ్వు విస్ఫోటనమవుతావు

విలువల వలువలు ధారగా వర్షిస్తుంటాయి
ఆనందాలు నిత్య ఏకవచనాలవుతాయి
లోగిళ్ల ముందు వెండివాన పందిళ్లు వేస్తుంది
నువ్వు విరహంతో వయ్యారంగా దూకేస్తావు
ఆడుకుంటావు, పాడుకుంటావు విరాగిలా మిగుల్చుతావు 
సీతాకోక చిలుక వదిలేసిన అడవిలా వెళ్లిపోతావు
కాసిన్ని వ్యథల్ని, రోదనల్ని, స్పందనల్ని జల్లేసి..

ఇక, నేను వాటిని ఏరుకొని, దాచుకొని..
ఏకాంత పథికుడ్నై, పదకర్తనై, కృతినై.. 
సక్రమంలో.. అక్రమనిర్మాణానికై తపిస్తూ.. రమిస్తూ...! 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు