అజ్ఞాతంలో నా పయనం

  • 57 Views
  • 0Likes

    ఎం.భానుప్రకాశ్

  • వనపర్తి జిల్లా
  • 9603973644

వేసే అడుగులకు అంతం తెలియదు
మెదిలే భావాలు పంతం వీడవు
వెలుతురు తెలియని అజ్ఞాతం పిలిచిందని
ఉరకలు పెడుతూ ముందుకునెడుతున్నాయి
చీకటిని చెరిపే కిరణం పుడుతుందని
ఏదో చిన్న ఆకాంక్ష!

ఎదురైన ప్రతి సవాలు
చీకటిని కొంత కుమ్మరిస్తూనే ఉంది
హృదయాంతరాలలో చీకటి
చెదరడానికి విశ్వాసదీపం మాత్రమే మిగిలింది
అదొక్కటిచాలు అడుగెయ్యడానికి
అది కూడా ఆరిపోతే!
అయినా నా పిచ్చి కాని..
విశ్వాసదీపం ఆరదన్న నమ్మకం ఉందిగా
చీకటికి బెదిరిన వెలుగు కనిపిస్తుంది
తరువాత వెలుగుకు చీకటి భయపడుతుంది
అందుకే సాగుతుందిగా
ఈ అజ్ఞాతంలో నా పయనం!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ప్రాణాధారం

ప్రాణాధారం

డా।। పింగళి గంగాధర్‌ రావు


అమృతం తాగిన ఆకాశం

అమృతం తాగిన ఆకాశం

జి.నరేష్‌ కుమార్


సంకురాత్రి గొబ్బిలక్ష్మి

సంకురాత్రి గొబ్బిలక్ష్మి

దాసరి కృష్ణారెడ్డి,


గోదారి...గోదారి...గోదారి

గోదారి...గోదారి...గోదారి

నేతల ప్రతాప్‌కుమార్‌


ములాఖత్‌

ములాఖత్‌

బండారి రాజ్‌ కుమార్‌


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌