హృదయంలో మేధస్సు 

  • 415 Views
  • 0Likes

    డా।। దేవరాజు మహారాజు

  • హైదరాబాదు
  • 9908633949

ఆలోచిస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది
ఒక్కొక్క జీవి, ప్రకృతి రచించిన
ఒక్కొక్క కవితా చరణంలాగా ముందుకొస్తుంది. 

అందమైన పొందికలో సృష్టి తన సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది
కవిత్వం అర్థం కాని వారికి విశ్వరహస్యాలేం అర్థమవుతాయి? 
జీవ ఆవిర్భావమే ఒక మహాకవిత్వమయినప్పుడు
అది అర్థం కావాలంటే హృదయంలో మేధస్సు ఉండాలి
మేధస్సులో హృదయముండాలి
ఎడారుల్లో సముద్రాల్ని, సముద్రాల్లో ఎడారుల్నీ చూడగలగాలి
కూలిపోతున్న చెట్లలో మొలకెత్తుతున్న గింజల్ని 
మొలకెత్తుతున్న గింజల్లో విశ్వవ్యాప్తమౌతున్న
జీవ ఆవిర్భావాన్నీ చూడగలగాలి
పిచ్చివాడా! నువ్వు అర్థం చేసుకుంటే
నిజాన్ని మించిన అందం లేదు 
విజ్ఞానాన్ని మించిన కవిత్వం లేదు 
ప్రతి జీవి అందమైందే కానీ
ప్రతి జీవినీ అర్థం చేసుకోగలిగే చేవ కేవలం మనిషికే ఉంది!

ఇన్ని సూర్యుల మధ్య, ఇన్ని గ్రహాల మధ్య
ఇన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో 
ఒక చిన్ని భూగ్రహం మీద పుట్టిన వాడు మనిషి
కొలతలు లేని, ఎల్లలు లేని విశ్వాంతరాళాల్లో
పరిభ్రమిస్తున్న వాడు మనిషి
సత్యమనే అందం కోసం తపించి పోవడమే కాదు 
ప్రాణాన్ని త్యాగం చేయడం కూడా తెలిసినవాడు
అందమైన వాక్యాలతో రాస్తున్నదే కవిత్వం కాదు 
సత్యాన్వేషణలో రాయబడేదంతా ఒక మహాకవిత్వం ఎందుకు కాదూ? 
అందమైన భావనకు అక్షరరూపమిచ్చేవాడే కవి అయితే
అదే అందమైన భావనను ప్రత్యక్షం చేయించేవాడు ఇంకెంత మహాకవి?
కవిత్వానికి ఎల్లలు చెరిపేస్తున్న కవి వైజ్ఞానికుడు!
ఏ ఆకృతీ లేని చిన్న బండరాయిని తొలిచి రూపం ఇచ్చేవాడే శిల్పి అయితే, 
ఆదీ, అంతం లేని విశ్వాంతరాళాన్ని మానవ శ్రేయస్సు కోసం
నిరంతరం తొలుస్తున్నవాడు ఇంకా ఎంత పెద్ద శిల్పి?

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అమృతం తాగిన ఆకాశం

అమృతం తాగిన ఆకాశం

జి.నరేష్‌ కుమార్


సంకురాత్రి గొబ్బిలక్ష్మి

సంకురాత్రి గొబ్బిలక్ష్మి

దాసరి కృష్ణారెడ్డి,


గోదారి...గోదారి...గోదారి

గోదారి...గోదారి...గోదారి

నేతల ప్రతాప్‌కుమార్‌


ములాఖత్‌

ములాఖత్‌

బండారి రాజ్‌ కుమార్‌


పొద్దున్నే దృశ్యాలు

పొద్దున్నే దృశ్యాలు

అన్నవరం దేవేందర్‌


పూలగుత్తి

పూలగుత్తి

లక్ష్మీరామారావు వెదురుమూడి