పండుతోంది కాబోలు

  • 349 Views
  • 3Likes

    నారాయణమూర్తి తాతా

  • కాకినాడ
  • 9298004001

లేడిలా పరుగెత్తిన పాదాలిపుడు
నడవడానికి జాగ్రత్తలు
చెప్పుకుంటున్నాయి

వేలిచివరి లోకాన్ని తీర్చిదిద్దిన
చేతులిపుడు వేళ్లాడిస్తూ ఊరికే
గొణుక్కుంటున్నాయి

పంచరంగుల్ని ఆవిష్కరించిన
కళ్లు మసక వెలుగుల్ని
చిత్రిక పడుతున్నాయి

చెరకు గడల్ని నమిలి పిండేసిన
పళ్లు ఒక్కొక్కటిగా పుచ్చిచచ్చి
సెలవు తీసుకుంటున్నాయి

సంగీతానికి తలలూపిన
చెవులు నిశ్శబ్ద సామ్రాజ్యానికి
తలుపులు తెరుస్తున్నాయి
కాటుక కళ్లకు గేలమేసిన కుటిల
కుంతలాలు తెల్లబడి, పల్చబడి
బోసిపోతున్నాయి

గళమెత్తి పాడినపాట, పెదవివిప్పి
ఆడినమాట గొంతుక దాటిరాక లోనే
గుడగుడ మంటున్నాయి

కంకర్రాళ్లను పిండి, గుండచేసిన
కడుపు మరమరాలను మర 
పెట్టలేకపోతోంది

బాణాకర్రలా నిగడదన్నిన
వెన్ను విల్లులా ఒంగిపోతోంది
నెమ్మది నెమ్మదిగా కాయం
పండుతోంది కాబోలు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ప్రాణాధారం

ప్రాణాధారం

డా।। పింగళి గంగాధర్‌ రావు


అమృతం తాగిన ఆకాశం

అమృతం తాగిన ఆకాశం

జి.నరేష్‌ కుమార్


సంకురాత్రి గొబ్బిలక్ష్మి

సంకురాత్రి గొబ్బిలక్ష్మి

దాసరి కృష్ణారెడ్డి,


గోదారి...గోదారి...గోదారి

గోదారి...గోదారి...గోదారి

నేతల ప్రతాప్‌కుమార్‌


ములాఖత్‌

ములాఖత్‌

బండారి రాజ్‌ కుమార్‌


సంద్రమే నా లోకం

సంద్రమే నా లోకం

గంటి వెంకటరమేష్,