విశ్వకల్యాణ సంక్రాంతిలక్ష్మి

  • 1389 Views
  • 0Likes

    - కల్యాణ శ్రీ (జంధ్యాల వేంకటరామశాస్త్రి)

  • పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా. 08814 223569

విశ్వశాంతి సువర్ణ సుప్రభాత కిరణాల్లో
భువిని సమతా పతంగాలు రివ్వున ఎగరగా,
గుండె వాకిళ్ల మమతల తోరణాలు వ్రేలగా,
స్వర్ణరథంలో వచ్చే సంక్రాంతి కల్యాణీ! స్వాగతం!!
తెలుగు గుమ్మాల ముంగిట ముత్యాల ముగ్గుల్లో
ముద్దుగా పూబంతుల గొబ్బెమ్మలను పేర్చి
‘గొబ్బిలక్ష్మి’ని పూజించే - కన్నెలను దీవించగా
వేగవచ్చే - సర్వమంగళ‘దాయని’కి సుస్వాగతం!!
గంగిరెద్దు కాలి మువ్వల - శుభకర స్వరాలు,
బుడబుక్కలవాని - డమరుక - ధ్వనులు
హరిదాసు - భక్తి కీర్తనలు - శుభాలందీయ
సాగి వచ్చే - ‘సౌభాగ్యలక్ష్మి’కిదే స్వాగతం!!
రైతన్నల - కష్టం ఫలించ - పంటసిరులనిచ్చి,
పసిపాపలపై భోగిపళ్లు - శుభములై కురియ,
‘సర్వే జనాః సుఖినోభవంతు’- అని ఆశీర్వదించ
తరలి వచ్చే- ‘శ్రీమహాలక్ష్మి’కి సుస్వాగతం!!
కుల మత భేదాలు భోగి మంటల్లో కాలగా,
అవినీతి బకాసురులు - అంతమొందగా
యువజనులలో- చైతన్యకాంతులు విరియగా
వేగవచ్చే - ‘సకలజన హితైషిణి’కి స్వాగతం!!
తెలుగు కలాలు - పసిడి కాంతులు తేజరిల్ల
ప్రతిగుండెలో అహింస, శాంతులు విరాజిల్ల
తెలుగు వెలుగుల - స్వర్ణ క్రాంతి రథంలో
విచ్చేస్తున్న - ‘విశ్వకల్యాణ సంక్రాంతిలక్ష్మీ’! సుస్వాగతం !!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌