పిచ్చిది పాపం

  • 1440 Views
  • 0Likes

    - సిరిమువ్వ

  • బండిఆత్మకూరు, కర్నూలు,
  • 8464048293

కడలి కూడా వదలి పోయిందేమో
తన తీయటి తీరంలో ఇదొక భావన
తనువుపై అలల ముడతలు చూసి
జాలిగా చేయి చాచి స్నేహించాలనుంది.
ఏకాంత సంధ్యలలో
సంద్రపు ఘోష, నా శ్వాస
ఎన్ని వూసులో భాష లేకుండా.
ఎంత ప్రేమించింది కాలాన్ని
ఆ కౌగిలి కోసం ఎలా కలలుకందీ
ప్రతిరోజూ రవితో రాయబారం
నడిరేయి వెన్నెల చెలిమి, అంతే తెలుసు తనకు
అవనిలో జనించిన క్షణం నుంచి
యుగయుగాల కన్నీటి వర్షాలే
తన గగనపు గాజు నయనాలతో
పిచ్చిది పాపం
తన మది నిండుగా ఉన్న కాలాన్ని మరచింది
ప్రణయ తీవ్రతలో మునిగి.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత