ఇంటిగాలి

  • 1421 Views
  • 0Likes

    డా॥ ఎన్‌.గోపి,

  • హైదరాబాదు,
  • 9391028496
డా॥ ఎన్‌.గోపి,

హాస్టల్లో కుర్రాడికి
ఇంటివైపు గాలి మళ్లింది.
అన్నం తినబుద్ధి కాదు
రెక్కలు లేనందుకు
మొదటిసారి దుఃఖమొచ్చింది.
మూడు రోజులుగా
ఒకటే వాన.
వానలోకి
వాడు చెదిరిపోతున్నాడో
వాడిలోకి వాన వ్యాపిస్తుందో
అర్థం కాదు.
చెరపట్టిన మబ్బుల్ని వదిలించుకొని
కాల్వలుగా మారిన నీరు
వడివడిగా నదివైపు
పరుగులు పెడుతుంది.
లేగదూడ
అంబా అని అరిస్తే ఉలికిపాటు,
ఏ రైలు కూత విన్నా
అది వాళ్లూరికే వెళ్తున్నట్టు
ఆ చీమలబారుకు
మొదలెక్కడోగాని
అన్నీ ఒకే బొరియలోకి
వెళ్లిపోతున్నట్టు,
పైకెగిరి
మళ్లీ అతుక్కోలేని ఆకులు
కిందనే మూల్గుతున్నట్టు.
ఇంటివైపు గాలి మళ్లింది.
అన్నం తినబుద్ధి కాదు
వాడిని
నా రెక్కల మీద ఎత్తుకొని పోయి
వాళ్లమ్మ ముందు
దించి రావాలని ఉంది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత