తెలుగింటి సంక్రాంతి

  • 2312 Views
  • 0Likes

    కేఎస్వీ ర‌మ‌ణ‌మ్మ‌

  • విశాఖపట్నం
  • 9347211537

తెలుగు లోగిలి వెలిగిపోతోంది,
రంగురంగుల రంగవల్లుల,
సోయగాలతో హొయలుపోతూ,
ఇంటింటి వాకిలి మెరిసిపోతోంది!
కుంకుమలద్దిన పసుపు గడపలు,
తోరణాలై మామిడాకులు,
వేలాడుతున్న వరికంకెలతొ,
సింహద్వారాలు స్వాగతించాయి!
తెలుగు కట్టూ, తెలుగు బొట్టూ,
సంప్రదాయపు తీరుతెన్నులు,
కొలువుతీరి, మరులు గొలిపాయి,
పరుగులెట్టి పెద్దపండగ అరుగులెక్కిందీ!
భోగిమంటలు మింటినంటే
ఆనందమిచ్చాయి;
బళ్ల నిండుగ ధాన్యరాశులు ఇంట చేరాయి,
దండిగా, గోమాత లింటను
పూజలందుకున్నాయి!
బంధుజనుల కలయికలతో,
నిండుగా నట్టిళ్లు నవ్వాయి!
పిండివంటల ఘుమఘుమలతో
వంటిళ్లు వెలిగాయి!
పట్టు పావడాలు కట్టి కన్నెలు
గొబ్బిళ్లు పెట్టి, కనువిందు చేశారు!
ఆటలాడే గంగిరెద్దులు, ఆనందమిచ్చాయి,
హరిదాసు పాటలు చెవులసోకి, ఆహ్లాదమిచ్చాయి!
భోగిపళ్ల సందడులతో
సంధ్యసుందరి సందడించింది!
పసుపుకుంకుమ పంచుకొనగా
అతివలంతా పేరంటమెళ్లారు!
అలిగి అలుగక అల్లుళ్లు ఇంటను
పేకాటలాడి పరవశించారు,
అల్లర్లు చేసే మరదళ్లతోను
సరసాల తేలారు!
కనుల పండగ కాగా మనసు తేలిపోయింది,
చిరకాల కోరిక తీరగా ఎద ఉప్పొంగిపోయింది!
ఒక్కపెట్టున కన్నులింతగ విచ్చుకున్నాయి,
చూసి మురిసినదంత ‘కల’యని నొచ్చుకున్నాయి.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత