అథ యోగానుశాసనం

  • 255 Views
  • 2Likes

    చంద్రశేఖర్‌ ప్రతాప

  • కరీంనగర్
  • 9948856377

తనువు పద్మాసనం వేస్తే
మనసు మర్కటాసనం వేస్తుంది!
పద్మమో, శలభమో
మయూరమో, మరోటో
దేహం వంచి చేసే ప్రతి కోణం
ఉనికితో అనుసంధానం కోసమే!
‘నువ్వే’ మూలాధారం అయితే
నువ్వెప్పటికీ మూలం వదిలిరాలేవు!
నువ్వు ఒక్కడివి కావు
బహుముఖాలతో
నువ్వొక గుంపువి!
ఓ నేర్పరి, ఓ తీర్పరి
ఓ మాయగాడు, ఓ ఆశపోతు.. 
ఎన్ని అందమైన అరలు నీలో!.
విషయ భారాలు, ఆశలూ
భ్రమలు, నమ్మకాలు, ఊహలు.
ఎన్ని మందమైన పొరలు నీలో!
భుజంగాసనం 
విషం చిమ్మకూడదని
నీకు నేర్పకపోతే..
మండూకం
దుర్భర నిర్జల తావులలో సైతం
నిబ్బరంగా వుండాలని
చెప్పకపోతే..     
నువ్వింకా భ్రమల్లోనే..   
వ్యర్థ విన్యాసాలు చేస్తూ
విషయభారాలు మోసే
గంగిరెద్దులానే..
గుంపు గందరగోళం వదిలి
నిశ్శబ్దంగా
నిన్ను నువు కోల్పోయి
ఉన్నదంతా ఖాళీ చేసి
పొరలన్నీ ఒలిచేసి
నువ్వు నువ్వు లా
వస్తే!..
యోగం
మరో పుస్తకం కాదు
నీ బుక్‌ షెల్ఫ్‌లో పడుకోదు!
యోగం
మరో జ్ఞానపుపొర కాదు
నీ చుట్టూ మందంగా అల్లుకోదు.!
యోగం 
నిన్ను ఉనికితో
మమేకం చేసే
ఓ అద్భుత ధ్యాన శాసనం!
యోగం
నిన్ను పరివర్తితుణ్ని
చేసే నిశ్శబ్ద అనుశాసనం.!
అథ యోగాను శాసనం..

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ప్రాణాధారం

ప్రాణాధారం

డా।। పింగళి గంగాధర్‌ రావు


అమృతం తాగిన ఆకాశం

అమృతం తాగిన ఆకాశం

జి.నరేష్‌ కుమార్


సంకురాత్రి గొబ్బిలక్ష్మి

సంకురాత్రి గొబ్బిలక్ష్మి

దాసరి కృష్ణారెడ్డి,


గోదారి...గోదారి...గోదారి

గోదారి...గోదారి...గోదారి

నేతల ప్రతాప్‌కుమార్‌


ములాఖత్‌

ములాఖత్‌

బండారి రాజ్‌ కుమార్‌


సంద్రమే నా లోకం

సంద్రమే నా లోకం

గంటి వెంకటరమేష్,