జీవితం

  • 265 Views
  • 4Likes

    జ్యోతి నండూరి

  • హైదరాబాదు
  • 8978639692

జీవితాన్ని నేలపైన ఆరేస్తే
రేపటి కథ రంగుల రాట్నంలో చిక్కుకుపోయింది
జీవితాన్ని అందంగా గాజుల పెట్టెలో భద్రపరచుకుంటే
జీవితం కన్నా గాజుల పెట్టె గురించి ఆలోచన మొదలయ్యింది
పల్లెలో పోగొట్టుకున్న జీవితాన్ని
పట్టణంలో వెతుక్కుంటుంటే, మనసు కన్నీటి బొట్టుని రాల్చింది
పగటిపూట చూడాల్సిన ప్రపంచాన్ని
రాత్రి చీకటిలో వడగట్టి చూస్తుంటే, నక్షత్రాలు నేలరాలిపోయాయి
గుండెబరువును తూయాలని చూస్తే 
సరితూగే కొలమానం లేదన్నది ప్రపంచం
బ్రహ్మ సృష్టిస్తున్నాడనుకుంటే, మనిషి సృష్టించడం మొదలుపెట్టాడు
సృష్టికి ప్రతిసృష్టి అందంగా కనపడుతున్న ప్రళయంలా ఉంది
మనసు మాటను రాయిపై చెక్కటానికి నేను శిల్పిని కాను
నీటిపై రాయడానికి నీటిగుణం నాలో అక్షరాన్ని నిలిపే లక్షణం లేదన్నది
అక్షరాన్ని అమృతంగా ఒంపుకుంటే
అక్షరం తన ఒడిలో నాకు చోటిచ్చి జోలపాడింది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అమృతం తాగిన ఆకాశం

అమృతం తాగిన ఆకాశం

జి.నరేష్‌ కుమార్


సంకురాత్రి గొబ్బిలక్ష్మి

సంకురాత్రి గొబ్బిలక్ష్మి

దాసరి కృష్ణారెడ్డి,


గోదారి...గోదారి...గోదారి

గోదారి...గోదారి...గోదారి

నేతల ప్రతాప్‌కుమార్‌


ములాఖత్‌

ములాఖత్‌

బండారి రాజ్‌ కుమార్‌


సంద్రమే నా లోకం

సంద్రమే నా లోకం

గంటి వెంకటరమేష్,


పొద్దున్నే దృశ్యాలు

పొద్దున్నే దృశ్యాలు

అన్నవరం దేవేందర్‌