మకర సంక్రమణం

  • 1398 Views
  • 0Likes

    - తృష్ణిత

  • మల్కాపూర్‌, కరీంనగర్‌జిల్లా

మార్గశిరం మొగ్గ తొడిగింది
పుష్యమి మళ్లీ పురుడు పోసుకుంది
ధనుర్మాసం ధాన్యలక్ష్మిని వదిలివెళ్లింది
పండగ పరిమళం పొగమంచులా కమ్మేస్తోంటే
సకల జనులే కాదు
పంటచేలూ అభ్యంగన స్నానాలాడుతున్నాయి
తుషార బిందువులతో!
సంక్రాంతి సూర్యుడు
కొత్తగా ఉదయించాడు.
గోరువెచ్చని కిరణాలతో
భోగిమంటలు పోటీపడుతూ
తెలుగువారి లోగిళ్లలో నులివెచ్చని
అనుభూతిని అందిస్తున్నాయి!
బుడబుక్కలవాని డమరుకం
నిద్రమత్తును గమ్మత్తుగా వదిలిస్తుంటే
జంగమదేవరల జానపదాలు
సుతిమెత్తగా సుప్రభాతం పాడుతున్నాయి
డూడూ బసవన్నల విన్యాసాలు
బద్ధకాన్ని అందంగా పారదోలుతున్నాయి
‘హరిలో రంగ హరి’ ఆలపిస్తూ హరిదాసు
పాశ్చాత్య సంగీతాన్ని
అథఃపాతాళానికి తొక్కేస్తున్నాడు
ఆహ్లాదమంతా ఆరుబయట
నాట్యం చేస్తోంటే
పాపాయిలా పండగ
బోసినవ్వులు రువ్వుతోంది!
అందుకే అన్నారు.
భోగి
భోగభాగ్యాలకు నిలయం!
మకర సంక్రమణం
మధురానుభూతుల సమ్మేళనం!
కనుమ
పాడిపంటల ప్రతిఫలం!
ఇది నిత్యనూతన సత్యం.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌