చిక్కటి చీకటి చిత్రాలు

  • 302 Views
  • 17Likes

    డా।। బుర్ర మధుసూదన్‌ రెడ్డి

  • కరీంనగర్
  • 9949700037

చీకటికెంత గర్వం?
తళుకుల తారలకే కాదు
నెలరేడు వయ్యారాలకూ
వేదికయ్యానని మురుస్తోంది!

నిశీధిని నిందించకు నేస్తం
నక్షత్రాల నాట్యాల్ని
వెన్నెల మామ వన్నెల్ని
ఆస్వాదిస్తూ ఆనందించు మరి!

నిశీధికెంత నిర్దయో కదా?
నా తోడైన నీడను...
ఆసాంతం మింగేసి..
నన్ను ఒంటరిని చేసింది మరి!

నిశీధికేం నీతి ఉంది?
చిక్కటి నిద్ర తెరపై..
చక్కటి చిత్రాల మబ్బులతో..
కురిపిస్తుంది కలల వర్షం!

చీకటిదెంత ఆకర్షణో కదా?
బెల్లం చుట్టూ ఈగల్లా..
వైఫై చుట్టూ నెటిజన్లలా..
మలిసంధ్య వేళ గూటికి చేర్చు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

ఆవులపాటి రెడ్డెప్ప


వేణువు

వేణువు

జుజ్జూరి వేణుగోపాల్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌