గ‌ల్లా పెట్టె

  • 317 Views
  • 54Likes

    డా।। చిట్యాల రవీందర్‌

  • ముంబయి
  • 7798891795

వ్యయాన్ని అదుపు చేసి
చేసే పొదుపును
అదను చూసి మదుపు
చేసే మధురిమ తీరే వేరు
చిరుప్రాయంలో
నేననుకునేవాణ్ని
నేనో ‘చిరు అంబానీ’ నవుతానని
తాతయ్య ప్రేమతో ఇచ్చిన
రూపాయి బిళ్లలూ...
నాన్న చిరునవ్వుతో చేతిలో ఉంచిన
అయిదూ పది నోట్లూ... 
బతిమాలగా అమ్మ
ఇచ్చిన రూపాయిలూ దాచుకొని
గుప్తంగా నా ఆశల్ని
అందులో బంధించుకొని
పండిన పంటకోసమై రైతు
ఎదురు చూస్తున్నట్టు చూస్తుండేవాణ్ని
నా డబ్బులు చాలా అవ్వాలనీ
పది... వంద... వెయ్యి అలా 
గాల్లోనే, గల్లా డబ్బులు
రెట్టింపులవుతుండేవి
దాని బరువు చూసి ఆనందిస్తుండేవాణ్ని
ఎప్పుడో నాన్న జబ్బు పడినప్పుడు
ఇంకా గభాల్న అవసరమొచ్చినప్పుడు
‘ఢాం’మ్మని మట్టి గల్లాపెట్టె పగిలేది
నా ఆశల
మంజూషని విరగ్గొట్టి

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తెలుగు రైతు

తెలుగు రైతు

ఎస్‌.ఆర్‌.పృథ్వి


మీటాలని ఉన్నదిలే

మీటాలని ఉన్నదిలే

స్వర్ణలతానాయుడు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

ఆవులపాటి రెడ్డెప్ప


వేణువు

వేణువు

జుజ్జూరి వేణుగోపాల్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి