ఇంద్రియ జ్ఞానం

  • 141 Views
  • 0Likes

    బి.నర్సన్‌

  • విశ్రాంత అధికారి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు
  • హైదరాబాదు
  • 9440128169
బి.నర్సన్‌

పాపం నడుమ కన్నుదేమున్నది
రిమోట్‌సిగ్నల్‌కు ఛానల్‌ మారే తెరే కదా!
చూపుల్లో కరుణనొలికించినా
లోచనాలు ఆలోచనల్లో ఈదినా
నిప్పులు పోసుకున్నా
కత్తులు మొలిపించినా
అంతా ఆదేశాలకు దృశ్య రూపమే కదా!
గొంతుదీ మూగవేదనే
మాట పదిలంగా ఉండాలని తెలుసు
పెగిలి గుండెల్ని పగలదీస్తున్నా
పెదవులు అధీనంలో లేని బతుకు
వెనకకు రానిది కాలమే కాదు 
మాట కూడా
మాట శాంతి సందేశాలనిస్తుంది
అణ్వస్త్రాలకు అడుగులూ నేర్పుతుంది
మాట పడటమంటే దెబ్బ మీద దెబ్బ
మాటకు గొంతు తుపాకీ గొట్టం
ట్రిగ్గర్‌ మాత్రం మెదడు హస్తగతం
చేయి సైతం ఓ కీలుబొమ్మే
చేతి నిండా కరచాలనంతో
హృదయ పుష్పం విప్పారినా
తలమీద చల్లని స్పర్శతో
వెన్నెల జల్లులు కురిపించినా
భుజం తట్టి బరువు దింపి
జారిన ధైర్యాన్ని గుండెల్లోకి తెచ్చినా
ఒకరి కోపానికి తాను పరికరమై
సాటి మనిషిని తోసేసినా
చొక్కా పట్టినా చెంపను చరిచినా
చేయిది సుశిక్షిత సైనిక పాత్రనే
ఇంద్రియాలన్నీ ఇంగిత జ్ఞానకోవిదులే
మంచే చేయాలనుకుంటాయి
మనిషి చేష్టలకు మదన పడతాయి.
కానీ యజమాని అజ్ఞాన కబోది!
తన అసహనానికీ¨ అవగుణానికీ
వాటి నిగ్రహాన్ని కొల్లగొడుతున్నాడు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తెలుగు రైతు

తెలుగు రైతు

ఎస్‌.ఆర్‌.పృథ్వి


మీటాలని ఉన్నదిలే

మీటాలని ఉన్నదిలే

స్వర్ణలతానాయుడు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

ఆవులపాటి రెడ్డెప్ప


వేణువు

వేణువు

జుజ్జూరి వేణుగోపాల్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి