నువ్వెవరూ!

  • 568 Views
  • 4Likes

    ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

  • వాశాలి, నెల్లూరు జిల్లా
  • 9490780831

చిరుజల్లే తాకకుండా
హరివిల్లే గొడుగుచేసి
తారల్నే తోడుపంపే
నువ్వెవరూ!
కనురెప్పే నువ్వు నాకు
కనుపాపే నేను నీకు
కనుదోయి చూడలేదు
నువ్వెవరూ!
నేలమ్మ పిలిచిందా ఎప్పుడైనా వానని
పువ్వమ్మ కోరిందా రమ్మంటూ చంద్రుని
కోకిలమ్మ అడిగిందని వచ్చిందా ఆమని
స్వార్థం అంటూ ఏమాత్రం లేని బంధం స్నేహమని
శ్వాసై నా ఎద లయలో
ధ్యాసై తను నామదిలో
ఆశై నా కల గదిలో
నిలిచే జ్ఞాపకమా..!
కడలి అలలెగసి పడి
వడిగా తను పరిగెడును
తీరం దరిచేరగనే
భారం అనురాగం
కెరటిమంటినా పరుగులెందుకు
మెరుపువానలో నా నడకలెందుకు
నీ రూపం చూసే భాగ్యం నాకు ఎప్పుడో..!
గాలై నా వేణువులో
రాగం నువ్వు పలికింప
స్వరమై సుమ అనురాగం
నామది పాడేను...
నడిచే ప్రతి దారులలో ధైర్యం 
తన ఉనికి నాలో మధురం 
ఆ తలపులలో
తడిసే మమతలలో
నీటి కలువలా ఎదురు చూపులెందుకు?
ఏటి నీటిలా ఈ అలికిడెందుకు?
నీ రూపం చూసే భాగ్యం నాకు ఎప్పుడో..!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కలవరం

కలవరం

మౌనశ్రీ మల్లిక్


పొగమంచు

పొగమంచు

విరాగి


రుణానుబంధం

రుణానుబంధం

చెంగల్వల కామేశ్వరి


కొన ఊపిరిలోనైనా

కొన ఊపిరిలోనైనా

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి