కడతేరి పోతివా

  • 54 Views
  • 0Likes

    చిన్నం అశోక్

  • హైదరాబాదు
  • 8125793090

శవమల్లె మారిన ఆ చెరువు జూసి
కట్టమైసమ్మ కూడా కన్నీరు గార్చింది
నను తాకి పోవేమే చెరువమ్మ అంటూ
అలుగు గోడ కూడా అలిగి నిలవడ్డది
నీ మీద తిరిగేటి ఆ నీటి కొంగలు
నీలోన పెరిగేటి తీరొక్క చేపలు
బతుకలేక నిను మొక్కి ఏడుస్తున్నాయి
దిక్కులేక తమ ప్రాణమిడుస్తున్నాయి
వరుణ రాజు కరకు గుండెకేమి ఎరుక
కంటిముందు కూలే కన్న పంట చూసి
చుక్క నీరు లేక ఎండింది నీ కడుపు
రైతు దేవుడి కంటి నీరైన నిను తడుపు
తుపాకి గుండ్లు తాకి ప్రాణాల్ని వదిలిన
సరిహద్దు సైనికుడి త్యాగానికి మల్లెగండ్లు గుచ్చి నీ ఒంటి నెత్తురే 
మాయమై పొలిమేరలో కలిసి 

కడతేరి పోతివా

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తెలుగు రైతు

తెలుగు రైతు

ఎస్‌.ఆర్‌.పృథ్వి


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

ఆవులపాటి రెడ్డెప్ప


వేణువు

వేణువు

జుజ్జూరి వేణుగోపాల్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి