వెన్నెల పాట

  • 48 Views
  • 0Likes

    పి.వి.ప్రసాద్‌

  • డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ‌
  • చౌడేప‌ల్లి, చిత్తూరు జిల్లా
  • 9490395116
పి.వి.ప్రసాద్‌

సాకీ: సలసల్లని సందెకాడ
తెలతెల్లని సందమామ
మెలిమెల్లిగ తొంగిజూసి
సనసన్నగ నవ్వుతుండాదె...
ఎన్నేలమ్మా ఎన్నేలమ్మా, ఎన్నెల సందమామదిగోనమ్మా
ఎన్నెల సందమామదిగోనమ్మా, ఎంతసక్కగుండాదో సూడోయమ్మా
సందమామ... అరెరే సందమామ
సందమామ కురిపిస్తే ఎండివానా
సలసల్లగ కురిసిందే కొండపైనా                ।।సందమామ।।
మల్లేలమ్మా మల్లేలమ్మా, మల్లెలపూల సెట్టదిగోనమ్మా
మల్లెలపూల సెట్టదిగోనమ్మా, ఎన్నిపూలు పూసినాయొ సూడోయమ్మా
మల్లెసెట్టు... అరెరే మల్లెసెట్టు
మల్లెసెట్టు కురిపిస్తే పూలవానా
గడ్డిపూలు మురిసిపాయె లోనలోనా            ।।మల్లెపూలు।।
కోనేరమ్మా కోనేరమ్మా, కోనేట్లో కలవపూలవిగోనమ్మా
కోనేట్లో కలవపూలవిగోనమ్మా, ఎంత పెద్దగుండాయొ సూడోయమ్మా
కలవపూలు... అరెరే కలవపూలు
కలవపూలు ఆడతాంటె నీల్లపైన
పిల్లగాలి పరవశిచ్చె శానశానా                ।।కలవపూలు।।
కిష్టప్పమ్మో కిష్టప్పమ్మో, ఏటిగట్టునుండాడు అదిగోనమ్మో
ఏటిగట్టునుండాడు అదిగోనమ్మో, ఎంతసక్కగుండాడు సూడోయమ్మో
కిష్టప్పకు... అరెరే కిష్టప్పకు
కిష్టప్పకు నెత్తిమీద నెమిలీక
రారమ్మని పిలస్తాండాదదిగోనమ్మో            ।।కిష్టప్పకు।।
పిల్లంగట్టెమ్మో, పిల్లంగట్టెమ్మో, కిష్టప్పకు పెదవులపై పిల్లంగట్టెమ్మో
కిష్టప్పకు పెదువులపై పిల్లంగట్టెమ్మో, పాటలెన్నో పాడతాందదిగో ఇనరమ్మో
పిల్లంగట్టి... అరెరే పిల్లంగట్టి
పిల్లంగట్టి పాడతాంటే ఎన్నెట్లోనా
ఆటలెన్నో ఆడదాము కదలండమ్మో         ।।ఎన్నేలమ్మా ఎన్నేలమ్మా।।
    (పిల్లంగట్టి- పిల్లనగ్రోవి)

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

ఆవులపాటి రెడ్డెప్ప


వేణువు

వేణువు

జుజ్జూరి వేణుగోపాల్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌