షరతులు వర్తిస్తాయి...

  • 164 Views
  • 15Likes

    పెద్దపాళెం నీలకంఠ

  • తిరుపతి
  • 9394029076

ఎపిసోడ్‌ అయిపోయింది
టీ.వీ.ని పొడిబట్టతో శుభ్రంగా తుడవండి
అది కన్నీళ్లతో తడిసిపోయింది.
నాయకుడు మాట్లాడేశాడు
సభనుంచి జనం వెనుదిరిగారు
మైక్‌ చెవుల్లోని దూది తీసేయండి.
సినిమా మొదలైంది
ప్రేక్షకుల జవసత్వాలు ఉడిగిపోతున్నాయి
రీళ్లన్నీ వారసత్వాల కంపుకొడుతున్నాయి.
రోడ్లు వాహనాలను ఈనుతున్నాయి
వాహనాలు ఇంధనాన్ని తాగుతున్నాయి
పెట్రోలు పంపులకు సెలైన్‌ ఎక్కించండి.
మాటలతో పాటు స్మార్ట్‌ పనులు ఎక్కువైనాయి
అయ్యో! దానికి రేడియేషన్‌ తలనొప్పి ఎక్కువవుతోంది
మొబైల్‌ ఫోన్‌కెవరైనా జండుబామ్‌ పట్టించండి.
కోరుకోవడం ఆగిపోయింది
అర్చనాభిషేకాలు పూర్తయ్యాయి
దేవుణ్ని శుభ్రంగా కడగండి
సాఫ్ట్‌వేర్‌ నేర్చుకొని మనిషి హార్డ్‌వేర్‌ అయ్యాడు
హార్ట్‌ను వేరుచేసుకొని హార్ట్‌లేనివాడయ్యాడు
కంప్యూటర్‌కి మానవత్వమనే ఓ.యస్‌.ను లోడ్‌చేయండి
వేసవిలో ఏసీల తలలు మాడిపోతున్నాయి
మనల్ని చల్లబరిచే పనిలో చచ్చుబడ్డాయి
విసనకర్రతో విసరండి అవి సేదతీరుతాయి
నదుల్లో నీరెండిపోయి కన్నీరు మిగిలింది
పవర్‌గ్రిడ్లు గుడ్లు తేలేస్తున్నాయి
పవర్‌ ప్లాంట్లకు ఇన్వర్టర్లు బిగించండి!
రాజకీయాల్లో నెంబర్‌వన్‌ కోసం పోటీ ఎక్కువైంది
డాబు, దర్పô, కత్తులు, బాంబులవే కుర్చీలు
నెంబర్‌వన్‌ అధికారపు కుర్చీలు లక్షకొనండి
వస్తు వినియోగం పెరిగింది
మనిషి కోరికల చిట్టా విచ్చుకుంది
ఆఫీసు బల్లల కింద నోట్ల కట్టలు ఉంచండి
స్నేహం, ఆత్మీయతలు చెట్టెక్కాయి
విక్రమార్కుడు బేతాళుడిచ్చిన లంచాన్ని మెక్కాడు
డబ్బులే జీవితమవడంతో కథ సాగటంలేదు
బాబ్బాబు! మనిషిని కాస్త వదలిపెట్టండి. 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

ఆవులపాటి రెడ్డెప్ప


వేణువు

వేణువు

జుజ్జూరి వేణుగోపాల్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌