రాత్రి కురిసిన వర్షం

  • 118 Views
  • 0Likes

    ఆవులపాటి రెడ్డెప్ప

  • పుంగనూరు, చిత్తూరు జిల్లా
  • 9885137615

రాత్రి కురిసిన వర్షానికి, అవని
హిమవశ్శీతల తుషార శ్వేతధారల్లో
అభ్యంగన స్నానమాడి, కురులుముడిచి,
హరితవస్త్రం, చుట్టుకున్నట్లుంది.

సిరులు పండించే సస్యశ్యామల క్షేత్రంగా
గగనమందించిన ప్రియరాగాన్ని ప్రేమతో
సాంతం అనుభూతిస్తున్నట్లుగా ఉంది.

భాషకందని, భావగర్భిత ముగ్ధై
హరితపల్లవి, అంకురానికై వేచి,
మౌనమై తియ్యని అనుభూతుల
ఆనందం తలబోసుకున్నట్లుంది.
పరవశాన పవళించిన ధాత్రి
చరాచర ప్రాణకోటి జగత్తుకు
క్షీరధారలందించి, ధన్యతపొందినట్లుంది.

చల్లగా, మెత్తగా, అమ్మ మనసులా
ఒడిచాచి వాత్సల్యంతో, క్షమా, సహనాలతో
అక్కున చేర్చుకునే తల్లిలా ఉంది.

మట్టి పరిమళాలను మనసారా ఆఘ్రాణించిన వర్షం
తనకు తాను త్యాగమై ధాత్రిలో ఏకమై
తదాత్మ్యం పొందినట్లుంది.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


జ‌ల క‌ల‌

జ‌ల క‌ల‌

సాక హరీష్‌


తేట తెలుగు

తేట తెలుగు

విద్వాన్ గొల్లాపిన్ని నాగ‌రాజ‌శాస్త్రి


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


వసంతశోభ

వసంతశోభ

స్వర్ణలతానాయుడు


నీ నీడలో....

నీ నీడలో....

డా॥ దిలావర్‌,