ఊహల వాన...

  • 773 Views
  • 5Likes

    జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి

  • అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా.
  • 9492988836

అప్పుడప్పుడు
ఇల్లు... ఇరుకైపోతే బాగుండు కదూ!
అందరం ఒకచోట చేరి ఊసులు
పంచుకోవచ్చు.
ప్రపంచం నిశ్శబ్దమైపోతే బాగుండు కదూ!
హృదయాంతరాళంలో భావం
వినిపించుకోవచ్చు.
యంత్రాలు స్తంభించిపోతే బాగుంటుంది కదూ!
మనలోని మనిషిని మేల్కొల్పవచ్చు.
మానవతా విలువల్ని పెంచుకోవచ్చు.
ఆకాశం అంధకారం అయిపోతే 
బాగుంటుంది కదూ!
నక్షత్రాలను లెక్కపెట్టే అమాయక
ఆనంద రోజుల్ని మళ్లీ నెమరేసుకోవచ్చు
ఓడిపోతే బాగుంటుంది కదూ!
ఓటమిలో కూడా మలుపుందని
ఓటమి గెలుపునకు పునాదని తెలుసుకోవచ్చు
అప్పుడప్పుడూ
నువ్వు నేనూ చెరోవైపు ఆలోచిస్తే 
బాగుంటుంది కదూ!
కొత్తగాలితో మన మెదళ్ల బూజును దులిపేసుకోవచ్చు.
పక్షులన్నీ గూటికి చేరుకుంటే
బాగుంటుంది కదూ!
మళ్లీ గూడు కళకళలాడుతుంది, 
సంతోషాన్ని ఇక్కడే చూసుకోవచ్చు.
రైతే రాజైపోతే బాగుంటుంది కదూ!
అందరి కడుపు నిండిపోతుంది.
ఆకలనే పదాన్ని నిఘంటువు నుంచి తీసివేయవచ్చు.
ఈ సమాజాన్నీ పునాదులను,
విలువల్ని కలిపి పునర్నిర్మించుకుంటే బాగుంటుందికదూ!
విదేశీ వ్యామోహాల జాడ్యాల నుంచి బయటపడవచ్చు.
ఊహలన్నీ సీతాకోకచిలుకలై 
మనమీద వాలిపోతే ఎంత బాగుంటుందోకదూ!
లోకమంతా... నందనవనమై...
మనమేమో వాటితో పూలవానలో తడిసిపోతాము.
అంతకుమించి ఆనందం ఈ ప్రపంచంలో 
ఉండదని రుజువు చేయవచ్చు కదూ!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


జీవన రుతువు

జీవన రుతువు

డా।। ఎన్‌.గోపి