మట్టి అమ్మ

  • 273 Views
  • 0Likes

    న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి

  • అమ‌లాపురం
  • 9247577501

మట్టిలో
క్షణ క్షణం శరీరం తడిసి ముద్దవుతోంది
ఆత్మవిశ్వాసంతో చిగురు కోసం
నిశ్శబ్దంగా నిరీక్షణ నాలో
ఆశ మొగ్గ తొడుగుతోంది
మట్టి మౌన బంధం ప్రేమగా హృదయంలో
ప్రవహిస్తోంది కాలంతోపాటు
కళ్లలో ఆకాశాన్ని నింపుకొని
చినుకు కోసం
గాయపడిన శ్రమ శరీరం చూస్తోంది
అల తీరాన్ని తాకినట్లు
జ్ఞాపకం మళ్లీ చిగురిస్తోంది
తెల్లవారితే పొలంలో
మట్టిలో శ్రమకెరటాల తాకిడి
నాలో...
విచిత్రంగా నువ్వు మృదువుగా అవతరిస్తావు
నీ స్మృతిలో నిత్యం నేనుంటాను
నువ్వూ నేనూ ఒక్కటే కదా!
కాళ్ళను పెదవులు చేసుకొని
నీతో ప్రతిరోజూ నిశ్శబ్ద సంభాషణచేస్తాను
మనిద్దరి అనుబంధం, ఆత్మీయత
అనుభూతులు
కాలానికర్థంకావు
నా ఆలోచన నీకోసం నీలో కలవాలని
నీవే నా గురువు
పొలాన్ని దున్నిన నా చేతులు
కొత్త వెలుగుల్ని నింపుకుంటాయి
గుండె మీద ఏదో శబ్దం
చిగురు సంగీతమది
నీ స్పర్శ
ఉదయించే సూర్యుడిలా
నా వంటి నిండా కాటుక పూసుకున్నట్లు
సుగంధం వెలుగు
మట్టి నాలుకపై ఆనంద నృత్యం చేయించాను
తొలకరి జల్లులో
నీ స్నేహం కోసం
చిగురు పాటకోసం
రోజూ పొలంగట్టు చుట్టూచిగురు జెండాలతో పాదయాత్రలే
పొలం పండితే నాలో
విజయోత్సవ గీతికలే
చిరునవ్వుల ఉదయాలే
నా కొండంత విశ్వాసానికి
పొలం నిండా ధాన్యపు గింజలే దృశ్యంగా
నేనూ మట్టినైతే బాగుండునని
రైతే మట్టిగా మారితే
చిగురు ఉత్తుంగ తరంగమే
మట్టి పరిమళాల్ని
అమ్మ వెచ్చని స్పర్శకన్నా గొప్పగా
నా మదిలో దాచుకుంటాను
జ్ఞాపకాల నదిలా

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పునర్నిర్మాణం

పునర్నిర్మాణం

దోర్నాదుల సిద్దార్థ


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


జయహూ జయహూ భారతధాత్రీ

జయహూ జయహూ భారతధాత్రీ

పులిగడ్డ శ్రీరామ చంద్రమూర్తి


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు