సంక్రాంతి సందడి

  • 1384 Views
  • 0Likes

    ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి

  • హైదరాబాదు
  • 9000789635
ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి

పిల్లలు, పెద్దలున్‌ తలకు పేరిమితోడుత స్నానమాడియున్‌
ఉల్లము తృప్తిజెందునటు ఉత్పల వస్త్రములన్‌ ధరించి, ఈ
పల్లెలు, పట్టణంబులలొ పట్టుగ కాన్పడ దేశమాత, తా
కొల్లగ సంతసింపదొకొ కోరిన కోర్కెలుదీర తృప్తిగాన్‌
గుండెల నిండుగా వెలుగు, గోదములందున ధాన్యరాశులన్‌
వండెడు శాకపాకములు, వచ్చియు జేరెడు బంధువర్గముల్‌
నిండుగ పారు ఏరులును, నిద్దురలేపెడు కోర్కెతంపటుల్‌
పండుగ రోజునన్‌ మనకు పావనమందగ కానుపించదే
గొబ్బితట్టెడు వనితల గొడవలటుగ
గంగిరెద్దుల సందడి గడపగడప
దాసు దీవనలొకవైపు దరికి జేర
సంకురాతిరి దెచ్చెను సకల శుభము
అలుక బూనియు అటకెక్కె అల్లుడకట
దింప జూచిన మామకు దిగులుబుట్టె
కోడిపందాల గొడవలు గొప్పవయ్యె
గాలిపటములు ఎగిరెను గగనమందు
కరకరలాడుగారెలును, కమ్మగజారెడు పాయసంబులున్‌
అరిశెలు, పూతరేకులును, ఆశను దీర్చెడిలడ్లు, జంతికల్‌
నురనురబోవు భాష్యములు, నోటికి తృప్తినియివ్వజూపగన్‌
కరవును దీర్చియిత్తరిని, కామిత మీయును జిహ్వకంతకున్‌

 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత