నేటి బాల్యం

  • 706 Views
  • 1Likes

    టి.వెంకట చంద్రశేఖర్

  • కడప
  • 9490570584

నాన్న చేయి విడిచి
కాన్వెంట్‌ బడిమెట్లు ఎక్కగానే
బాల్యపుటిరుసుల్లో
ఏవో సన్నని విరుపులు
అసలు బాల్యం ప్రసవించగానే
ఆంగ్లభాషా విషవాయువులు
కమ్ముకొస్తాయి!
కమ్ముకొస్తున్నప్పుడే
బాల్యపు పునాదుల్లో బీటలు
కథలు చదివి
కనకపు లోకంలో యువరాజుగా
విహరించాల్సిన బాల్యం
కార్టూన్‌ ఛానెళ్ల 
కారాగారంలో ఖైదీ అయ్యే!
పిల్లకాల్వల్లో ఈత కొట్టాల్సిన బాల్యం
వీడియోగేమ్‌ల జలపాతాల్లో 
తడిసి ముద్దయ్యే!
మార్కుల మాయాలోయలోకి
జారుకున్న బాల్యం
ర్యాంకుల వేటలో తలమునకలయ్యే!
పద్యాలు వల్లెవేయాల్సిన సమయాన
పబ్జీలాంటి క్రీడల్లో విహారం
అమ్మ చేతి పిండివంటలు ఆరగించి
మైదానంతో దోస్తీ కట్టాల్సిన బాల్యం
కార్పొరేట్‌ చదువుల కదనరంగంలో
సొమ్మసిల్లిపోయే!
జాబిల్లి వెలుగులోన
నానమ్మ నోటివెంట
జాలువారే నీతి సుధల
ప్రవాహపు జాడమరచె
ఏ ఇంటి శుభకార్యపు
డప్పు మోగినా
చిందులేస్తూ సందడిచేసే
అమాయకపు బాల్యం 
నేడు నెట్టింట్లో
మూలన కూలబడిపోయే
చిరుజల్లుల్లోన
చిట్టి పడవలెక్కాల్సిన బాల్యం
కాన్సెప్ట్‌ చదువుల పల్లకీలెక్కి
ఎటెల్లిపోయెనో!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరచేయి

అరచేయి

తగుళ్ల గోపాల్


క్రీస్తు జననం

క్రీస్తు జననం

పచ్చా పెంచలయ్య


మొగ్గలు

మొగ్గలు

డా।। భీంపల్లి శ్రీకాంత్


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


వాన

వాన

తానా మూర్తి