వంకర టింకర

  • 664 Views
  • 0Likes

    పర్కపెల్లి యాదగిరి

  • సిద్దిపేట
  • 9299909516

కనులు మూసుకొని
నీలోకి నీవు నడచిపోతేనే
నిను అనుసరించే నీడలు
నీతో సాగే సమాంతర రేఖలు
నీకు ఎదురుపడే ఆటంకాలేవో
తెలిసిపోతుంది

గతం నిను గీసిన రూపంలోని
అనవసరపు గీతలను చేరిపేసుకునే వీలు ఎప్పుడూ
ఉంటుంది నీకు

నువ్వు సాగిన అడుగుల జాడల్లోనే
నీ సందేహాలకు సమాధానం
దొరుకుతుంది

సదా కొలిమి రగిలించబోతూ
కనులు పొగచూరుకోవడం కాదు
మనుగడ సాగించడం అంటే

జాబిలితో జత అయి
జలపాతాలలో జలకమాడే
అవకాశమూ ఉంటుంది

నువ్వు అనుకుంటే ఎప్పుడైనా నీకు
మరణం చేయినీయగలదు

కానీ జీవితానికి నీ చిటికెన వేలు అందించి ఉదయం వైపు
నడిపించడమే మధురం

సూరీడు కుంగే వేళ తలచి
బెంగపడటం ఎందుకు
మనం చీకటిలో 
గరికపోసల కొసలమీద రాలిన
మంచుబిందువులమే

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు