తెలుగు రైతు

  • 238 Views
  • 6Likes

    ఎస్‌.ఆర్‌.పృథ్వి

  • రాజమహేంద్రవరం,
  • 9989223245

పచ్చని పల్లెతనంలో కరిగి
పంటభూమిగా విస్తరిస్తాడు
చినుకురాలి
చింత తీరగానే
ఆశయాల విత్తులు నాటి
వరికంకులై మొలకలెత్తుతాడు
తీరని వేదనా భారాన్ని
గుండెకింద అణచిపెట్టి
చిరునవ్వును పెదాలపై చిలకరిస్తాడు
పంట పురుగులు
ఆత్మవిశ్వాసాన్ని కొరికేస్తాఉన్నా
అప్పులు, వడ్డీల్లో నాని
హృదయాన్ని పిండేస్తాఉన్నా
చెదరని హుందాతనాన్ని
తలపై పాగాచేసి నిలుపుతాడు
పంట పరువానికొచ్చిన వేళ
పొలం గట్టుమీద నులకమంచమై
కళ్లలో దివిటీలు
వెలిగించుకుంటాడు
అనుభవించిన కష్టాలన్నింటినీ
శ్రమ స్వేదంలో కడిగేసి
జాతినోట అన్నం మెతుకవుతాడు
పండగలు సంబరాలైనప్పుడు
పల్లె గుమ్మానికి
పచ్చతోరణమై పరవశిస్తాడు
గుడిలో గంటై మోగి,
జనసీమను మేల్కొలుపుతాడు
ముంగిట్లో రంగవల్లై
అందరినీ పలకరిస్తాడు
తనే పండగై శోభిస్తాడు
జీవనాడి తెలిసిన తెలుగురైతు!

 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తెలుగు రైతు

తెలుగు రైతు

ఎస్‌.ఆర్‌.పృథ్వి


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

ఆవులపాటి రెడ్డెప్ప


వేణువు

వేణువు

జుజ్జూరి వేణుగోపాల్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి