మాతౄణం

  • 353 Views
  • 9Likes

    పుట్టి గిరిధర్‌

  • మహబూబ్‌నగర్‌
  • 9491493170

అద్దంలో ఎవరి ముఖం వారికే అందం
భాషైనా యాసైనా సొంతమైనదే అందం!
సొగసైన భాషాభవంతి నిలబడాలంటే
మమకారపు పునాదులు వేయాల్సిందే!
ప్రాచీనహోదాతో మరింత ముసలిదైన
మాతృభాషను మళ్లీ బతికించడానికి
ఇంకే ప్రాచీన మానవులు ఆసరా ఇవ్వాలో
ఇంకే ఆదిమానవులు వర్ణమాల మొదలెట్టాలో!
ఆంగ్లేయులను తరిమికొట్టిన భూమిపై
ఆంగ్లభాషే సర్వాధికారమయ్యింది!
జ్ఞానానికన్నా ముందు హోదాగా మిగిలింది
మనసుకన్నా ముందు రూపమే నిలిచింది!
ఎవరి భాషను వారు గుండెలో నింపుకుంటుంటే
మనం మాత్రం హృదయ విహీనులమవుతున్నాం!
ఒకవైపు పదకోశాల కోసం పాకులాడుతుంటే
పరభాష అలంకరణలో మునిగేది కొందరు!
ఒకవైపు వాస్తవాల కోసం పోరాడుతుంటే
స్వప్నాల్లో తేలియాడేది ఇంకొందరు!
తేనెలూరే భాషను ఏ తనువు కాదంటుంది
జాలువారే భాషను ఏ జాతి కాదంటుంది!
మాతృత్వం ఎరిగిన మనసు మానుకుంటుందా
మాధుర్యం పంచే పలుకు మౌనమౌతుందా!
మాతృమూర్తిని సేవించి, మాతృభాషను ఆదరించి
మాతృభూమిని కాపాడి, మనిషిగా వెలుగుదాం!
మనమైన మనంగా కలకాలం మిగులుదాం!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తెలుగు రైతు

తెలుగు రైతు

ఎస్‌.ఆర్‌.పృథ్వి


మీటాలని ఉన్నదిలే

మీటాలని ఉన్నదిలే

స్వర్ణలతానాయుడు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


రాత్రి కురిసిన వర్షం

రాత్రి కురిసిన వర్షం

ఆవులపాటి రెడ్డెప్ప


వేణువు

వేణువు

జుజ్జూరి వేణుగోపాల్‌


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి