జ‌ల క‌ల‌

  • 216 Views
  • 0Likes

    సాక హరీష్‌

  • అమరచింత, వనపర్తి
  • 9493603594

ఊర్ల పిల్లలందరు - ఉర్క వట్టిండ్రు,
ఏందని ఆర తీస్తే..
సెరువు పొంగి - సేండ్లల్ల నీళ్లొచ్చినయని,
ఊరికి తూర్పున ఉన్న 
గొల్లగేరు మునిగిందని..
నీళ్లల్లా సేపలు - ఎగులాడుతున్నయని,
పిల్లలందరూ - ఎత్తిన కాళ్లు దించకుండా
వొకటే ఉర్కవట్టిండ్రు..
మల్లయ్య.. ఈ యేడు-
నీళ్లకు ఏం కరువులేదు..
అని,
పక్కింటి కురుమయ్య తాత..
మా తాతతో.. చెబుతున్నాడు..
అంతలో.. మసక మసకగ ఉంది..
కళ్లునలుపుకొని..
కాస్త తేరిపారా.. చూద్దును కాదా

ఒరేయ్‌.. హరిగా..
ఈ పగటి కలలేంటి..
లెవ్వు..
అమ్మ తడిమి లేపింది..

అవును..
నాకు.. వచ్చింది.
పగటి జల కలే..
ఆ కల నెరవేరాలన్నదే..
నా కల

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నువ్వెవరూ!

నువ్వెవరూ!

ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌


ఉగాది

ఉగాది

బి. రఘురామరాజు


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌


సెల్ఫీ

సెల్ఫీ

నారాయణమూర్తి తాతా


కలాపవిలాపనం

కలాపవిలాపనం

జూకంటి జ‌గ‌న్నాథం