శిల్పిబ్రహ్మ

  • 251 Views
  • 1Likes

    డా।। కపిలవాయి లింగమూర్తి

  • నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లా.

గౌతమబుద్ధుని జాతకంబెల్లను
   అమరావతీ స్తూపమందు పొదుగ
వాత్స్యాయనుని శాస్త్రమర్మంబు లెల్లను
   ఖజురహో కుడ్యాల కళలు నింప
జాయపనాట్య శాస్త్రంబెల్ల రామప్ప
   ఆలయ స్తంభాల మేలమాడ
కైలాసనాథుని ఓలగంబెల్లను
   ఎల్లోరలో నొకేగల్లుకెత్త
బలిపురంబున కృష్ణుని బాల్యలీల
బండలను గండరించి జీవంబువోయ
ఎన్నియేండ్లు తపించితో ఎఱుగవశమె
సిద్ధ పురుషులకైనయో శిల్పిబ్రహ్మ
విశ్వనాథుని భావ వీధిలోనైనను
   విహరించజాలని విభ్రమములు
వర్ణశోభలు జిమ్ము వడ్డాది కుంచియ
   వొలికించజాలని హొయలలయలు
బాపురేఖలు గూడ ప్రకటింపజాలని
   భావాలు విరజిమ్ము ప్రకృతి సుషమ
అక్కినేనికి గూడయభినయానందని
   కామనీయక ముఖ కవళికలును
నీదుయులి మొనయందున నిలిచిపొంచి
రాసముందేలు రాజవరాలి మోము
లందుసుత్తెను చేపట్టినపుడు నీవు
సృష్టికర్తవు నీవెపో శిల్పిబ్రహ్మ

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


భద్రత

భద్రత

బషీర్


నువ్వెవరూ!

నువ్వెవరూ!

ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌


ఉగాది

ఉగాది

బి. రఘురామరాజు


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌


సెల్ఫీ

సెల్ఫీ

నారాయణమూర్తి తాతా