అకాలం

  • 170 Views
  • 0Likes

    స్వాతీ శ్రీపాద

  • హైదరాబాదు
  • 8297248988

ఎక్కడినుంచి ఉరుకులు పరుగులతో
దొర్లుతూ వచ్చాయి నల్లమేఘాలు
ఎక్కడిదీ ముసురు పూలమాలిక
మతి భ్రమించిన మత్తేభాలు
అవిరైన ఎందరి కన్నీళ్లను అదిమిపెట్టి
పొంగే సముద్రాలు
ఎప్పటికప్పుడు ఉబికి
వస్తున్న
ఉద్విగ్న సమయాలను
పిడికిట ఒడిసిపట్టుకున్న
జలపాతాలు
కదులుతున్నట్టే అనిపిస్తుంది
చీమంతైనా కదలిక ఉండదు
కరుగుతున్నట్టే ఒక విభ్రమ
కాస్తంతైనా ద్రవీభవించదు
పెదవులు వెక్కిరించే తుంపరగా
ఉండీ ఉండీ ఒక చిరుజల్లు
ఉన్నట్టుండి ఆకాశగంగ జారిపడినట్టు
ఎడతెరిపిలేని కుండపోత
అకాలం ఏదోనాటికి సకాలం అవక మానదు కదా

ఇదేం వింత!
ఇక్కడా అంతే కదా
లక్షలాది మందిలో ఒక గుప్పెడు మాత్రమే
అణచిపెట్టిన పైరుపంటల మీద
అవమానపు నిప్పుల వాన కురిపిస్తారు
భరించే అవని హృదయం మీదకు
సునామీలను ఉసిగొల్పుతారు
రేపంటే మాదేనంటూ
నేటి జీవితాలపై దౌర్జన్యం ప్రకటిస్తారు.
అధికారాలనెక్కి విజయ శంఖం పూరిస్తారు 

ఎంత అనకొండ లాటి దర్పమైనా
ఏదో ఒక రోజున
విగత జీవిగా పడి ఉండక తప్పదు
ఎంత బక్కపలచని జీవికైనా
ఎక్కడి నుండో
వెయ్యి ఏనుగుల బలం ఉబికి రాదూ

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నువ్వెవరూ!

నువ్వెవరూ!

ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌


ఉగాది

ఉగాది

బి. రఘురామరాజు


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌


సెల్ఫీ

సెల్ఫీ

నారాయణమూర్తి తాతా


నేటి బాల్యం

నేటి బాల్యం

టి.వెంకట చంద్రశేఖర్