వరదాయిని దివ్య శుభాంగీ

  • 160 Views
  • 0Likes

    పుల్లాభట్ల నాగశాంతి స్వరూప

  • రాజమహేంద్రవరం
  • 7780473349

పల్లవి
అరుణ కిరణతుల
చరణ కమలములె
కరుణ నెలవులని నమ్మి     ।।2।।
శిరమునుంచితిని సుమ్మి.        
వరదాయిని! దివ్య శుభాంగీ
శివమోదిని! భవ్య లతాంగీ    ।।2।।

చరణం 1 
నయన చలనములె
భువన భవలయలు
నడుమ నటనమది మాది    ।।2।।
కడమ ఘటనమది నీది        
వరదాయిని! దివ్య శుభాంగీ
శివమోదిని! భవ్య లతాంగీ    ।।2।।

చరణం 2 
ధవళ గిరి పతిని
సరస వచనముల
సరియు జేయునది నీవే     ।।2।।
మురియు జేయునది నీవే        
వరదాయిని దివ్య శుభాంగీ
శివమోదిని భవ్య లతాంగీ    ।।2।।

చరణం 3 
హరు మెలంకువకు
హరి తలంపునకు
విధి విలాసమునకీవే        ।।2।।
అధికారిణివై యున్నావే
వరదాయిని దివ్య శుభాంగీ
శివమోదిని భవ్య లతాంగీ    ।।2।।

చరణం 3
కమలలోచనుని
అనుఁగు చెల్లెలా
కనగలేము నీ లీల        ।।2।।
భవుని యింటి యిల్లాలా
వరదాయిని దివ్య శుభాంగీ
శివమోదిని భవ్య లతాంగీ    ।।2।।

చరణం 4
తెలియకబ్బినది
తెలివికబ్బినది
పద కవిత్వముగ మార్చి    ।।2।। 
పాటవోలె చేకూర్చి

అందింతునమా! ప్రేమార
చేకొందువమా! మనసార ।।2।।    ।।అరుణ।।

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నువ్వెవరూ!

నువ్వెవరూ!

ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌


ఉగాది

ఉగాది

బి. రఘురామరాజు


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌


సెల్ఫీ

సెల్ఫీ

నారాయణమూర్తి తాతా


కలాపవిలాపనం

కలాపవిలాపనం

జూకంటి జ‌గ‌న్నాథం