ఎడబాటు

  • 245 Views
  • 1Likes

    బండారి రాజ్‌ కుమార్‌

  • పాతమగ్ధుంపురం, వరంగల్‌ రూరల్
  • 9959914956

మట్టిదీ... మనిషిదీ
సావుతో ఎడబాసే బంధం కాదు
మట్టిలో గల్సినవంటే..
అవ్వ పొత్తిళ్లలోకి మర్రిపోయినట్టే
దుక్కిదున్నినోడిని సూత్తె
దుక్కమాపుకోలేక..
మట్టితల్లి గుండె నెర్రులుబాత్తది
మట్టికి రెక్కలుంటే..
పోయిన రైతుల పానాలు
ఇట్టే.. పట్టుకొచ్చేదేమో!
బిడ్డల మీద అవ్వకెప్పుడూ పావురమే
బిడ్డ కనబడకుంటే.. అవ్వకెప్పటికీ తండ్లాటే
గావురాల బిడ్డలు గాల్లో గల్సిపోతాంటే
అవ్వ బతుకిప్పుడు వలపోతల సంద్రమే
అవ్వ దుక్కమాపుడు ఎవల వశమైతది?
అవ్వ పొత్తిళ్లలో ఒదిగినోడు
విత్తనమై మొలకెత్తి చిగురిస్తే బాగుండు!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కలవరం

కలవరం

మౌనశ్రీ మల్లిక్


పొగమంచు

పొగమంచు

విరాగి


రుణానుబంధం

రుణానుబంధం

చెంగల్వల కామేశ్వరి


కొన ఊపిరిలోనైనా

కొన ఊపిరిలోనైనా

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి