మనసులు విప్పుకున్న క్షణాల్లో...

  • 241 Views
  • 1Likes

    స్వర్ణ

  • రాజమహేంద్రవరం
  • 9676635017

ఇద్దరు- మనసులు విప్పుకున్న క్షణాల్లో..
రెండు పూవుల పరిమళం- కానరాని గాలి అలలపై..
చెట్టాపట్టాలేసుకుని వాహ్యాళికి వెళ్లినట్టు!
ఇద్దరు- మనసులు విప్పుకున్న క్షణాల్లో..
పసిబిడ్డ ముఖంలోని భావాలంత తేటగా..
అడుగు సైతం కనిపించే రెండు సెలయేళ్లు
ఒక్కటిగా సంగమించినట్టు!
ఇద్దరు- మనసులు విప్పుకున్న క్షణాల్లో..
‘దేవుడి’కి సైతం పట్టరాని రెండు మెరుపులు..
తమను తాము
ఒక్కటిగా పేనుకుని, పెనవేసుకున్నట్టు!
ఇద్దరు- మనసులు విప్పుకున్న క్షణాల్లో..
ఎందుకో, ఎన్నడో, ఎలాగో విచ్ఛిన్నమైన విశ్వం..
రెండు ఏకాకితనాలై, వేగివేగి, వెతికి వెతికి..
పునరేకీకృతమైనట్టు!
పుట్టుక పరమార్థం పరిపూర్ణమైనట్టు!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


భద్రత

భద్రత

బషీర్


నువ్వెవరూ!

నువ్వెవరూ!

ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌


ఉగాది

ఉగాది

బి. రఘురామరాజు


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌


సెల్ఫీ

సెల్ఫీ

నారాయణమూర్తి తాతా