మౌనంగా ఒక నీ కోసం

  • 460 Views
  • 3Likes

    గ‌విడి శ్రీనివాస్‌

  • బెంగ‌ళూరు
  • 8722784768

నీ లోకంలోకి
ఒంటరిగా వస్తాను.
మనసారా నవ్వుతూ
చల్లని వెన్నెల పరచి
కూర్చోపెడతావు.
నా కోసం
పరితపిస్తూ పలవరిస్తూ
పలకరిస్తూ పరిభ్రమిస్తూ
కాలాన్ని కౌగిలిస్తావు.
కారణాల వివరణేలేని
బంధనాల వలలో
విలవిల్లాడుతూ
ఒక ముగ్ధమనోహర నీ కోసం
ఒక ఆత్మీయ సమ్మేళనం కోసం
మోడు బారిన చెట్టులా
నిలిచి నిరీక్షిస్తుంటాను.
కలల్ని నిర్మించే వాళ్లే కాదు
కన్నీళ్లను తుడిచేవాళ్లూ 
కావాలి.
మనసు అల్లిన పందిరిలో
మౌనంగా
నాలోనే మంచులా రాలుతూ
నీ కోసం
ధ్యానిస్తున్నాను.
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌