జీవం కోల్పోయి..

  • 318 Views
  • 0Likes

    ఎస్‌.ఆర్‌.పృథ్వి

  • రాజమహేంద్రవరం,
  • 9989223245

అక్కడి అనుబంధాలు
ఆత్మీయతా రాగాన్నే పలికేవి
నిరంతర స్నేహ మాధుర్యం
ఊరంతా పరిమళమయ్యేది
ఏపుగా ఎదిగిన చెట్ల సమూహం
ఊరంతా పచ్చని కాన్వాసుని పరిచేది
శబ్ద, వాయు కాలుష్యాలు జంటగా
అల్లంత దూరాన్నే ఉరిపోసుకునేవి
మలినం లేని మనసుల నిండా
వెన్నెల పూలు విరబూసేవి
పొలాల ఎదిగిన పచ్చని పైర్లు
బతుకులకు  భరోసా ఊసులు చెప్పేవి
మనుషుల పలకరింపుల్లో
మమకారం పొంగుకొచ్చేది
పొలిమేర ఛాయల్ని తోసుకొని
గ్రామంలో అడుగు పెట్టే పాదాలకి
ఊరి కోనేటిలోని ఎర్ర కలువలు
స్వాగత స్వరాలను ఆలపించేవి
పశుపక్ష్యాదులు మనసార
స్వేచ్ఛను ఆలింగనం చేసుకునేవి
ఏడాదికోమారు గ్రామదేవత
కొలువైన చోట సంబరాల దివిటీలు వెలిగేవి
అప్పుడు పల్లె అంటే పచ్చదనాల తోట
చలికాలంలో భోగి మంటల వెచ్చదనపు మూట
సంక్రాంతి నాటి పిండివంటల గుబాళింపు
ఆవు పేడతో అలికిన లోగిలిలో
మెరిసే మేలిమి ముగ్గుల జాతర
పల్లె అంటే కల్లా కపటం తెలియని
అమ్మతనానికి నిలువెత్తు నిజరూపం
మరిప్పుడు, పల్లె దారుల నిండా
కనిపించని ముళ్ల కంపలు
అభివృద్ధిని నెత్తిన మోస్తున్నట్లు
పరిశ్రమల శిరస్సుల నుంచి
పొంగుకొస్తున్న మృత్యుహరణాల పొగ
ఒకరికొకరు కక్ష గట్టి నరుక్కొంటున్న
రాజకీయ కుట్రల కత్తుల పొదలు
వర్గాల సృష్టిలో విభేదాలను రగిల్చే
ధనస్వామ్యపు ఎత్తుల పొత్తులు
పల్లె ఇప్పుడు జీవం కోల్పోయి
వ్యర్థాలను మోస్తున్న మురుగునీటి కాలువలాగ!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


 కరోనా విలయం

 కరోనా విలయం

సాహితీసుధ


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌