ఒక సాయం కాలం

  • 41 Views
  • 0Likes

    లాస్యప్రియ కుప్పా

  • హైదరాబాదు
  • 9640551664

శిశిరంలో ఒక సాయంత్రం
చెట్ల నీడల్లో అంతులేని తాత్వికత
పక్షులగూళ్లల్లో చింతలేని సాత్వికత
ఏటి గలగలల్లో ఎంచలేని మార్మికత
అనుకోకుండానే 
అనుభూతుల ఉపరితలం మీద
అందమైన గులాబీ మొగ్గ తొడుగుతుంది
అలవాటుగానే నీతో అడుగులు కలుపుతాను
ప్రేమమయమైన చిరుగాలి
తోడు వస్తానంటుంది
భావమయమైన హృదయకలం నెమలికుంచెలా
నిన్ను అన్ని కళ్లతో పలకరిస్తూ ఉంటుంది
నీలిమేఘాల తళుకుల్లో
అంతులేని తడి పలకరింపులు
రాలిపోతున్న ఆకుల గలగలల్లో
అవ్యాజమైన ప్రేమ చిలకరింపులు
చిగురుల స్వాగతింపుల్లో
అనుభవాల రంగరింపులు
నిశ్శబ్ద క్షణాల గుసగుసల్లో
ఎవరెవరో నడుస్తూ పరిగెత్తుతూ
పడిపోతూ, లేచి ఒగరుస్తూ
సమయాన్ని ఇంతకంటే గొప్పగా
గడపలేమంటూ నిర్లక్ష్యపు నసనసలు
బాధపడుతూ భగ్నపడుతూ
సొంతంకాని శరీరాలంటారు
కనిపించని ఆత్మలమంటారు
అంతులేని ఆవేదనంటారు
పొంతనలేని మాటలు వింటూంటాను
ఈ రుసరుసల్లో
నిన్ను మాత్రం అదే ధ్యానంతో
అంతే ఆరాధనతో
జీవితపు పుటల్లో మరో పుటని
ఆసక్తిగా, ఆలోచనగా
ఆత్రంగా, ఆప్యాయంగా
రాసుకుంటూనే ఉంటాను
ఖాళీని నింపుకుంటూనే ఉంటాను

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


 కరోనా విలయం

 కరోనా విలయం

సాహితీసుధ


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌