నాలో

  • 59 Views
  • 1Likes

    వినోద్‌ గోరంట్ల

  • తిరుపతి.
  • 9985959290

రేపటి కోసం భయపడి
గుండె అల్మరాలో నిర్జీవంగా పడి
బయటకి రావాల్న వద్దా
అన్న ఆలోచన దగ్గరే కొట్టుకుంటున్న
వాడిని బయటికి లాగిచూడు
ఆత్మవిశ్వాసం అంటే ఏంటో అర్థం అవుతుంది!!
నెల చివర కట్టాల్సిన ఇఎమ్‌ఐలకు కట్టుబడి
గుండె లోతుల్లో అణచివేయబడ్డ
ఆలోచనలని ఒక్కసారి బయటికి తీసి చూడు
నువ్వేంటో నీకు పరిచయమవుతుంది!!
ఆలోచనల వెనకాల ఉన్న అనుభవాలని కాదు
నరనరాల్లో అంతర్లీనమైన నీ కలని అడుగు
నువ్వు చూసేది కాదు నువ్వు వెతికేది కనపడుతుంది!!
ప్రపంచంతో మాట్లాడే నిన్ను కాదు
నీతో మాట్లాడే నిన్ను అడుగు
నువ్వు వెతికే సమాధానాన్ని కాదు
నువ్వు అడగాల్సిన ప్రశ్నను పరిచయం చేస్తుంది!!

నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పే నీ కష్టాల మూటలని కాదు
నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పే నీ ఆశయాల మాటలను విను
బంగారు భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో వినిపిస్తుంది!!
నువ్వు పడుతున్న కష్టాలని
చెదిరిన నీ జ్ఞాపకాలని కాదు
నువ్వు చేరుకోవాల్సిన సముద్ర తీరాన్ని అడుగు
గమనం ఎంత హాయిగా ఉంటుందో అర్థమవుతుంది!!
నీ గుండెకైన గాయాలని కాదు
నీ గుండె కన్న కలలని స్మరించు
నువ్వు కలలు కన్న గమ్యం
ఎంత గొప్పగా ఉంటుందో రుజువవుతుంది!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌


ఆశాకిరణం

ఆశాకిరణం

ప‌ద్మావ‌తి రాంభ‌క్త‌