నాన్న రుణం

  • 47 Views
  • 0Likes

    కొత్త అనిల్‌కుమార్

  • కరీంనగర్.
  • 9395553393

ఆయన భుజాల మీదకెక్కినపుడు
ఆకాశం నా అరచేతికి అందేది
అమ్మ నుంచి వేరు పడిన తర్వాత 
నేను అతికించుకున్న అపురూప బంధం
నా కోసం ఎన్ని కలలు కన్నాడో కాని,
నా కలలన్నీ ఆయనే నిజం చేశాడు
ఒక పసిగుడ్డుకు లోకాన్ని చూపించి
తొలి గురువై బతుకు పాఠాలు నేర్పించాడు
అతని వేలు పట్టుకుని నడుస్తుంటే
ప్రపంచాన్ని జయించినంతటి గొప్ప అనుభూతి
నేనేది అడుగుతానో... కోరుకుంటానో
నా కంటి చూపులను అడిగి
తన శక్తిని పిడికిళ్లలోనే దాచేసి మరీ 
నా అరచేతిలో సమస్తం నింపేవాడు
నా లేత పాదాలతో తన దేహాన్ని
స్పర్శింపజేసుకున్న సంతోషాన్ని చూడలేదు
కాని, తెలిసీ తెలియక నేననే మాటలు తాకిన తన గుండె వేదన చూశాను.
ఎప్పటి రుణం అప్పుడే తీర్చుకునే వరం
దేవుడు నిజంగా నాకిచ్చి ఉంటే
బిడ్డగా తనకొక జన్మనిచ్చి
ఆ చిరుపాదాలతో సంతోషంగా గాయపడేవాణ్ని.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌